సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని సమాజ మార్పుకై దానిని ఉపయోగించాలని కోరిక సాహితీ యోథుడు శ్రీ శ్రీ పండిత చర్చలకు మాత్రమే సాహిత్యం పరమితం చేయరాదని, సామాజిక చైతన్యాన్ని నింపి ప్రజలను కార్యాచరణకు పురిగొల్పాలని, నిజమైన వికాసాన్ని, ప్రభోధాన్ని ఇచ్చే శక్తి సాహిత్యానికే ఉందని, రచయిత పీడిత తాడిత ప్రజల పక్షానే నిలవాలని విశ్వసించిన కార్యశీలి యుగకర్త శ్రీశ్రీ కష్టజీవులు శ్రమ చిందించే స్వేద జలానికి గొప్ప కవితారూపం ఇచ్చి శ్రామికవర్గ స్పృహను తెలుగు కవిత్వంలో రగిలించిన ప్రజాకవి, ఎనిమిదేళ్ల పసి వయస్సులోనే కలం చేతపట్టి రచనా వ్యవసాయం సాగించిన భావకవి.సృష్టివాదాన్ని నిర్భయంగా తిరస్కరించి పవిణామవాదాన్ని నమ్మిన హేతువాది. పీడిత ప్రజల పక్షాన నిలిచి విప్లవ శంఖం పూరించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. అతడే రెండు శ్రీశ్రీల ధనదరిద్రుడు, కవితా ఘన సముద్రుడు మన శ్రీశ్రీ…
No comments:
Post a Comment