చంద్రమండలంపై స్ధిరనివాసాలు ఏర్పచుకోవమెట్లా ? మార్స్ గ్రాహం జీవించడానికి అనువైన ప్రాంతాలు విశ్వంలోని ఇతర గ్రహాలలో ఉన్నాయా ? అంటూ నిరంతర నిరంతర పరిశోధనలు, అన్వేషణలు చేస్తున్న మనిషి గ్లోబల్ వార్మింగ్ కారణంగా తన కాళ్ళ క్రింద మట్టికొట్టుకుపోతుంటే నిస్సహాయుడుగా చూస్తూ ఉండిపోతున్నాడు. మరికొద్ది కాలంలో మనిషి ఉనికికే ప్రమాదం రాబోతోంది. భూమిపై ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే అధికంగా పెరిగిపోవడమే గ్లోబల్ వార్మింగ్. సాధారణంగా భూమి సూర్యుని నుండి గ్రహించిన వేడిని తిరిగి వాతావరణంలోనికి విడుదల చేస్తూ తన ఉష్ణోగ్రత క్రమబద్దీకరించుకుంటుంది. కానీ భూమి మీద మానవాళి పారిశ్రామిక కార్యాకలాపాలవల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోయి వాతావరణంలో ఒక పొరలాగ ఏర్పడి భూమి విడుదల చేసే ఉష్ణాన్ని వాతావరణంలోనికి వెళ్ళకుండా అడ్డుకుంటాయి. దీనికారణంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా భూమి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా వ్యవహరిస్తారు.
No comments:
Post a Comment