MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, November 19, 2016

ఉద్యోగ భద్రత కల్పించాలి

మధురానగర్‌ : 16 ఏళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్స్‌గా పనిచేస్తున్న లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్‌ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎం దయాకర్‌ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్స్‌ డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం ప్రభుత్వ కళాశాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నామన్నారు. జీతాలు చాలక కుటుంబాలు అర్ధాకలితో, పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని చెప్పిన పాలకులు నేడు తమను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలుచేయని ప్రభుత్వాలు, తమను క్రమబద్ధీకరించటానికి మాత్రం సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పిందంటూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జీఓ 16 ప్రకారం 2–94 యాక్ట్‌ను సవరించిందని, ఏపీలో తమ గురించి ఆలోచించిన వారే కరువయ్యారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు జీతాలను రెట్టింపు చేసుకునేందుకు నిధుల సమస్యలు లేవని తమ వేతనాలు పెంచడానికి, క్రమబద్ధీకరించడానికి నిధుల కొరత కనిపించడం హేయమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం దశల వారీ ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశామని, 21 నుంచి 23 వరకు పోస్టుకార్డు ఉద్యమం, 24, 25 తేదీలలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించటం, 28న కలెక్టరేట్‌వద్ద ధర్నా, డిసెంబర్‌ 1న కుటుంబ సభ్యులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్‌ 2 నుంచి నిరవధిక దీక్షలను చేపడతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు జాన్సన్, విజయశ్రీ,, రాంబాబు, సుధాకరన్, జ్యోతి, సునీత, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments: