MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, September 18, 2016

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్‌సోర్సింగ్‌కు నో

- హైకోర్టు ప్రజాశక్తి - హైదరాబాద్‌ 
            ప్రభుత్వాసుపత్రుల్లో నర్సింగ్‌, పారా మెడికల్‌ స్టాఫ్‌ను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించడం చెల్లదని హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామలింగేశ్వరరావు సంచలన తీర్పు చెప్పారు. అవుట్‌సోర్సింగ్‌లో వైద్య రంగంలో కొనసాగించడం చెల్లదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కి విరుద్ధమని తేల్చి చెప్పారు. నిధుల కొరత పేరుతో ఖాళీల భర్తీ చేయకపోవడం చెల్లదని, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతి వల్ల రోగులపై ప్రభావం పడుతుందన్నారు. ఔట్‌సోర్సింగ్‌ విధానంతో వైద్యరంగంలో భర్తీలు చేయడం చెల్లదని, సర్వీసు నిబంధనలకు తిలోదకాలిచ్చినట్టు అవుతుందన్నారు. ఈ కారణంగా ఖాళీల్ని భర్తీ చేసేందుకు అదీ శాశ్వత పద్ధతిలో
చేసేందుకు తొలుత పోస్టుల్ని గుర్తించాలని, ఖాళీల్ని భర్తీ చేయాలని, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని హైకోర్టు ఏపి సర్కార్‌ను ఆదేశించింది. అధికారులు, ఆయా శాఖల అధికారులు ఇష్టానుసారంగా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో నియామకాలు చేయడం పరిపాటిగా మారిందని, ఇలా చేయడం వల్ల వారి సర్వీసుల్ని రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌కు దారితీస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేడియాలజీ, ఈఎన్‌టీ, న్యూరాలజీ, కార్డియాలజీ ల్యాబరేటరీల్లో సమర్ధత ఉన్న సిబ్బంది వైద్య సేవలకు చాలా ముఖ్యమని, అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్లు దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్లు చూస్తే ఖాళీల్ని భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, కానీ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ చర్యలు తీసుకోవడం లేదన్నారు. అవుట్‌సోర్సింగ్‌ పద్ధతి వద్దని, ఖాళీల్ని భర్తీ చేయాలని ఇదే హైకోర్టు గతంలో తేల్చి చెప్పినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని, ఈ పద్ధతి వల్ల వైద్యం కోసం వచ్చే రోగులపై తీవ్రప్రభావం పడుతుందని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం పౌరులకు వైద్య సేవలు అందించాలన్న స్పూర్తిని నీరుగారుస్తున్నారని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రోగులు ఆస్పత్రికి వసే..్త అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది వైద్యసేవలు, ల్యాబ్‌పనులు చేయడం వల్ల సమస్యలు వస్తే రోగి ప్రాణాలకు మీదకు వచ్చే ప్రమాదం లేకపోలేదని హైకోర్టు హెచ్చరించింది. నిధుల లేమి పేరుతో నామమాత్రంగా ప్రభుత్వఆసుపత్రులు పనిచేస్తే ఎలాగని ప్రశ్నించింది. అందుకే చాలా మంది స్థోమత ఉన్నా లేకపోయినా ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీలు కూడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి, ప్రైవేటీకరణపై విశ్వవ్యాప్తంగా చర్చ సాగుతోంది, అయినా ఏపీ సర్కార్‌ అవుట్‌సోర్సింగ్‌ మార్గానే ఎంచుకుందని వ్యాఖ్యానించారు. అవుట్‌సోర్సింగ్‌ ద్వారా సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగానే కాకుండా ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింటెమెంట్స్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ రేషనలైజేషన్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పాట్రన్‌ అండ్‌ పే స్ట్రక్చర్‌ యాక్ట్‌ -1994కు వ్యతిరేకం. .. అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అవుట్‌సోర్సింగ్‌ విధానంలో కొనసాగుతున్న పిటిషనర్లు పలు ఆస్పత్రుల్లో సర్వీసులు కొనసాగిస్తున్నారని, వారి సర్వీసు రెగ్యులరైజేషన్‌ అడ్డదారిలో కొనసాగించకూడదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, కనుక ఆయా పోస్టుల భర్తీ సమయంలో ఏపి సర్కార్‌ వారి సర్వీసుల్ని అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయమూర్తి రామలింగేశ్వరరావు తన తీర్పులో తేల్చి చెప్పారు.

No comments: