సార్వత్రిక సమ్మె సైరన్ మోగింది. దేశవ్యాప్తంగా 18 కోట్ల మంది కార్మికులు కదం తొక్కడానికి సిద్ధమైనారు. సమ్మెను విఛ్చినం చేయడానికి పాలకులు చేసిన కుట్రలను ఛేదిస్తూ శుక్రవారం ఉదయం దేశ వ్యాప్తంగా సమ్మె పతాకం ఎగరనుంది. కొన్ని ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుండి సమ్మె ప్రారంభమైనట్లు సమా చారం అందింది, జాతీయ కార్మిక సంఘాలు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఒక్కసారి కూడా దీనిపై కార్మిక సంఘాలతో చర్చించ లేదు. సమస్యలు పరిష్కరిస్తామన్న రాతపూర్వక హామీ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిర సనగా . గతం కంటే ఎక్కువ మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.
కార్మిక సంఘాల డిమాండ్లు :
1. ధరలు తగ్గించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.
2. నిరుద్యోగాన్ని తగ్గించి, ఉద్యోగ కల్పనకు నిర్మాణాత్మక విధానాలు రూపొందించాలి.
3. ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రాథమిక కార్మిక చట్టాలు అమలు చేయాలి.కార్మిక చట్టాల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాలి.
4. కార్మికులందరికి సామాజిక భద్రత కల్పించాలి.
5. కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలి.
6. మొత్తం శ్రామిక జనాభాకు రూ.3,000లకు తక్కువ లేకుండా పెన్షన్ హామీ ఇవ్వాలి.
7. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల అమ్మకాలు ఆపాలి.
8. పర్మినెంట్ పోస్టుల ఖాళీలను కాంట్రాక్టు పద్ధతితో కాకుండా శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయాలి. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగుల వలే వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలి.
9.బోనస్, ప్రావిడంట్‌ఫండ్ ఇచ్చేందుకు చెల్లింపులు, అర్హతలు తొలిగించాలి. బోనస్ పెంచాలి.
10. దరఖాస్తు చేసిన 45 రోజుల్లోనే కార్మిక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. తక్షణమే ఇండియన్ లేబర్ ఆర్గనేజేషన్(ఐఎల్‌ఒ) కన్వెన్షన్ సి87 మరియు సి98 లను ఆమోదించాలి.
11. కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి.
12. రైల్వే, ఇన్సూరెన్స్, డిఫెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడు(ఎఫ్‌డిఐ)లను వ్యతిరేకించాలి.

- గురువారం అర్ధరాత్రి నుండే ప్రారంభం
- కదం తొక్కనున్న 18కోట్లమంది
- భారీగా కదులుతున్న బిజెపి పాలిత రాష్ట్రాల కార్మికులు
- విధులకు హాజరు కావాల్సిందే : మమత హుకుం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక సమ్మె సైరన్ మోగింది. దేశవ్యాప్తంగా 18 కోట్ల మంది కార్మికులు కదం తొక్కడానికి సిద్ధమైనారు. సమ్మెను విఛ్చినం చేయడానికి పాలకులు చేసిన కుట్రలను ఛేదిస్తూ శుక్రవారం ఉదయం దేశ వ్యాప్తంగా సమ్మె పతాకం ఎగరనుంది. కొన్ని ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుండి సమ్మె ప్రారంభమైనట్లు సమా చారం అందింది, జాతీయ కార్మిక సంఘాలు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఒక్కసారి కూడా దీనిపై కార్మిక సంఘాలతో చర్చించ లేదు. సమస్యలు పరిష్కరిస్తామన్న రాతపూర్వక హామీ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిర సనగా . గతం కంటే ఎక్కువ మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికులు జరుపు తున్న చారిత్రాత్మక సమ్మెకు దేశంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. విద్యార్థి, యువజన, రైతు, మహిళ సంఘాలు తమ మద్దతు ప్రకటిం చాయి. సమ్మెలో భాగంగా విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సాంస్కృతిక బృందాలు ఇప్పటికే పెద్దఎత్తున ప్రచారం చేశాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక సాంస్కృతిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్ని బోసిపోనున్నాయి. డిఫెన్స్, ఆర్‌బిఐ, బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్, స్టీల్, పోర్టు, బిఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, వర్కర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటు న్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సమ్మెను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అక్కడ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టి సమ్మెలో పాల్గొం టున్నారు. ప్రధానంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం గమనార్హం. సిఐటియు, కార్మిక సంఘాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అక్కడి తృణమూల్ ప్రభుత్వం మూడు రోజుల పాటు ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని హూకుం జారీ చేసింది. మరోవైపు తొలి నుంచి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న ఆశతో ఉన్న బిఎంఎస్ సమ్మె నిర్ణయంలో భాగస్వామిగా ఉంది. కాని సమ్మె నోటీసు ఇవ్వలేదు. సమ్మెలో బిఎంఎస్ అధికారికంగా పాల్గొనక పోయినప్పటికి, క్షేత్ర స్థాయిల్లో బిఎంఎస్ అనుబంధ సంఘాల కార్మికులు పాల్గొంటున్నారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్, ఎఐయుటియుసి, టియుసిసి, యుటియుసి, ఎస్‌ఈడబ్ల్యుఎ, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఫెడరేషన్లు, యూనియన్లు, వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి.
సమ్మెను విజయవంతం చేయండి : సిపిఎం
జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో గురువారం కార్మిసంఘాలకు పిలుపునిచ్చి మద్దతు ప్రకటించింది. సమ్మెను విజయవంతం చేయాలని దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ శాఖలకు, కేడర్‌కు కూడా పొలిట్ బ్యూరో పిలుపునిచ్చింది.
సమ్మె విచ్ఛిన్న కుట్రలు తిప్పికొట్టండి : సిఐటియు
కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని సిఐటియు పిలుపునిచ్చింది. కార్మికులకు మరింత మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం నిబద్ధతతో వుందంటూ ఆగస్టు 31వ తేది రాత్రి 9గంటలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మీడియాకు ఒక పత్రికా ప్రకటన జారీ చేశారని, ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదని సిఐటియు ఖండించింది. ఈ మేరకు సిఐటియు కార్యదర్శివర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి, శుక్రవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇది కేంద్రం పన్నిన కుట్రని పేర్కొంది. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ దేశాభివృద్ధికి కట్టుబడి వున్నామని చెప్పుకోవడమంటే హిపోక్రసీ (బూటకం) తప్ప మరొకటి కాదని సిఐటియు కార్యదర్శివర్గం విమర్శించింది. తమ పోరాటం నుండి కార్మికులను వెనక్కి మళ్లించడానికి ప్రభుత్వం ఈ తరహా జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శించింది.
సమ్మెను జయప్రదం చేయండి : ఎఐకెఎస్
దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని అఖిల భారత కిసాన్ సభ(ఎఐకెఎస్) పిలుపునిచ్చింది. మోడి ప్రభుత్వపు కార్పొరేట్ అనుకూల విధానాలకు కార్మికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తున్నదని పేర్కొంది. నయా ఉదారవాద కార్పొరేట్ శక్తుల కింద ఇప్పటికే నలిగిపోతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మిక, శ్రామికవర్గాలపై ఇది కిరాతక దాడి అని ఎఐకెఎస్ తెలిపింది. పెరుగుతున్న ధరలను నియంత్రిస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మోడి విస్మరిస్తున్నారని ఆరోపించింది. ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్నారని విమర్శించింది. ఈ విధానాలను రైతులు, కార్మికులు సహించే పరిస్థితిలో లేరని పేర్కొంది. ఈ తరహా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే కార్మిక సంఘాలు సమ్మె జరుపుతున్నాయని తెలిపింది.
కార్మిక సంఘాల డిమాండ్లు
1. ధరలు తగ్గించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.
2. నిరుద్యోగాన్ని తగ్గించి, ఉద్యోగ కల్పనకు నిర్మాణాత్మక విధానాలు రూపొందించాలి.
3. ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రాథమిక కార్మిక చట్టాలు అమలు చేయాలి.కార్మిక చట్టాల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాలి.
4. కార్మికులందరికి సామాజిక భద్రత కల్పించాలి.
5. కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలి.
6. మొత్తం శ్రామిక జనాభాకు రూ.3,000లకు తక్కువ లేకుండా పెన్షన్ హామీ ఇవ్వాలి.
7. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల అమ్మకాలు ఆపాలి.
8. పర్మినెంట్ పోస్టుల ఖాళీలను కాంట్రాక్టు పద్ధతితో కాకుండా శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయాలి. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగుల వలే వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలి.
9.బోనస్, ప్రావిడంట్‌ఫండ్ ఇచ్చేందుకు చెల్లింపులు, అర్హతలు తొలిగించాలి. బోనస్ పెంచాలి.
10. దరఖాస్తు చేసిన 45 రోజుల్లోనే కార్మిక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. తక్షణమే ఇండియన్ లేబర్ ఆర్గనేజేషన్(ఐఎల్‌ఒ) కన్వెన్షన్ సి87 మరియు సి98 లను ఆమోదించాలి.
11. కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి.
12. రైల్వే, ఇన్సూరెన్స్, డిఫెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడు(ఎఫ్‌డిఐ)లను వ్యతిరేకించాలి.
సమ్మెకు వామపక్ష పార్టీల మద్దతు
కార్మిక శక్తి దేశాన్ని స్తంభింపచేయనుంది.కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికులోకం సిద్ధమయింది. ఈ సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి తదితర కార్మిక సంఘాలు శుక్రవారం సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి 12 డిమాండ్లతో కూడిన అంశాలను కార్మిక సంఘాలు కేంద్రానికి అందజేశాయి. ఈ 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో కార్మికులు సమ్మె నోటీసులు ఇప్పటికే జారీ చేశారు. కనీస వేతనం రూ.18,000లుగా చెల్లించాలని, కార్మిక చట్టాల సవరణలు ఉపసంహరించు కోవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రద్దు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కారం కోసం కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు.
విజయవంతం చేద్దాం : వైసిపిి ట్రేడ్ యూనియన్
కార్మిక వర్గ పొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను జయపద్రం చేద్దామని వైసిపి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ అదుపు చేయడం, సమ్మెలను నిషేధించడం, కార్మికులను ఇష్టానుసారం తొలగించడం లాంటి దుర్మార్గమైన క్లాజులను కొత్త చట్టంలో రూపొందించారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కంటే మరింత దూకుడుగా చంద్రబాబు ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందన్నారు.
No comments:
Post a Comment