MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, April 25, 2015

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగించడం అన్యాయం - ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మేలో నిరసన కార్యక్రమాలు

రాష్ట్రంలో ఉన్న 3లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇదే పద్ధతిలో ఏదొక వంకతో తొలింగిచినా ఆశ్యర్యపడనక్కర లేదన్నారు. ముఖ్యమంత్రి ఇలా చేయడంలో ఆరితేరిన వ్యక్తని, అన్నింటికీ సమర్థుడన్నారు. 3లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏకమై ఉద్యమాలు చేయకపోతే గృహనిర్మాణ శాఖలోని ఉద్యోగులను, అంగన్‌వాడీలను తొలగించినట్టే అందరినీ తొలగించేంకు కుట్రలు పన్నుతారన్నారు
చంద్రబాబుది నిరంకుశ ప్రభుత్వం
Posted on: Thu 23 Apr 23:29:22.792505 2015
- దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సిఎం

- ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగించడం అన్యాయం
- ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మేలో నిరసన కార్యక్రమాలు 
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో 

                       ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది నిరంకుశ ప్రభుత్వమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సార్సింగ్‌ ఉద్యోగుల మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. తొలగించబడిన గృహనిర్మాణ సంస్థ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఇందిరాపార్క వద్ద మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిభిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పై తెలుగుదేశ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, దౌర్జన్య పూర్వకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశ్య పూర్వకంగానే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తొలగించే కార్యక్రమాలకు పూనుకుందన్నారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడతోంటే వారిని ఏమి చేయలేక అవినీతి నెపంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో ఉన్న 3లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇదే పద్ధతిలో ఏదొక వంకతో తొలింగిచినా ఆశ్యర్యపడనక్కర లేదన్నారు. ముఖ్యమంత్రి ఇలా చేయడంలో ఆరితేరిన వ్యక్తని, అన్నింటికీ సమర్థుడన్నారు. 3లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏకమై ఉద్యమాలు చేయకపోతే గృహనిర్మాణ శాఖలోని ఉద్యోగులను, అంగన్‌వాడీలను తొలగించినట్టే అందరినీ తొలగించేంకు కుట్రలు పన్నుతారన్నారు. గోదావరి పుష్కరాల కోసం ఏకంగా రూ. 1400 కోట్లు కేటాయించిందని, దీన్నే కాంట్రాక్ట్‌ , ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం కేటాయిస్తే 3 లక్షల మంది జీవితాలు రోడ్డున పడకుండా బాగుపడుతాయన్నారు. అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఇప్పటికైనా మేలుకొని ఉద్యమ బాట పట్టాలని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానానికి తెరతీసిందన్నారు. పేదలు, కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దుర్మార్గంగా పనిచేస్తోందన్నారు. రైతుల నుంచి వ్యవసాయ భూములను అన్యాయంగా లాక్కొంటోందన్నారు. బోగాపురం విమానాశ్రయానికి 15 వేల ఎకరాలు కేటాయించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. తాను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని సిఎం అనుకుంటే అది పొరపాటే అవుతుందాన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని, తిరగబడతారని హెచ్చరించారు. తాను చేస్తున్న అన్యాయాలకు ఎదురొడ్డే వారిని భయబ్రాంతులకు గురిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆందోళన కారులను పోలీసులతో కొట్టించడం, గుర్రాలతో తొక్కించడం, కాల్పులు జరిపించడం చంద్రబాబు నిరంకుశ నైజం అన్నారు. సాక్షాత్తు అసెంబ్లీలో పెంచుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి అంగన్‌వాడీలను ఉద్యోగాలను నుంచి తొలగించడం ఎక్కడి న్యాయం అన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, ప్రదర్శిస్తున్న నిరంకుశత్వానికి వ్యతి రేకంగా మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దెత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. గృహనిర్మాణ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు మీద ముఖ్యమంత్రికి లేఖ రాస్తామన్నారు. ఉద్యోగాలు సాధించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్‌ గృహనిర్మాణ సంస్థ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నేతలు తెలిపారు. ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌ ఆదినారాయణ, గౌరవాధ్యక్షలు ఆర్‌ లక్ష్మయ్య, గౌరవ సలహాదారు పి పోతు రాజు, ట్రెజరర్‌ వి మురళీకృష్ణతో పాటు 13జిల్లాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాల్గొన్నారు. గురువారం మూడో రోజు దీక్షను ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జాతీయ కార్యదర్శి ఎం జనార్థన్‌ రెడ్డి ప్రారంభించగా, సిఐటియు జనరల్‌ సెక్రెరటరీ ఎండి అబ్బాస్‌, ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె పార్థసారధి తమ మద్ధతు ప్రకటించారు. అంతకు ముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ విషయం మీద రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్విహించారు. అనంతరం గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వేలవన్‌ని కలిసి వినతి పత్రం సమర్పించగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుని కలవమన్నారని నేతలు తెలిపారు.

No comments: