MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, January 2, 2015

ACT NEWS::ఆన్‌లైన్‌ యుగం....


హైదరాబాద్:మనం చూస్తుండగానే కాలం మారిపోతోంది. అత్యవసరాల జాబితా పెరిగిపోతోంది. ప్రతి మనిషి చేతిలోనూ ఓ సెల్‌ఫోన్‌ వుంటుందనీ, అందులోనూ డ్యూయెల్‌ సిమ్స్‌ వుంటాయనీ, మొబైల్‌ పనిచేయకపోతే పిచ్చెక్కినట్టుగా వుంటుందని ఓ పదిహేనేళ్ల క్రితం మనమెవరమైనా ఊహించామా? అప్పట్లో సెల్‌ఫోన్‌ వాడకం ఎంత కాస్ట్లీ వ్యవహారం! ఎవరిదగ్గరైనా సెల్‌ఫోన్‌ వుంటే వారిని ఎంత అపురూపంగా చూసేవాళ్లం! మరిఇప్పుడు అదే మనకు నిత్యావసరమైపోయింది.
అన్నీ ఆన్ లైన్ లోనే.....
ఇది ఆన్‌లైన్‌ యుగం. ఆన్‌లైన్‌ లోనే బుకింగ్‌. ఆన్‌లైన్‌ లోనే షాపింగ్‌. ఆన్‌లైన్ లోనే పేమెంట్స్‌. ఆన్‌లైన్‌లోనే వర్కింగ్‌. ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్స్‌. ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు. ఆన్‌లైన్‌ సెలక్షన్స్‌. ఇంటర్నెట్‌ సౌకర్యం వున్న కంప్యూటర్‌ ముందు కూర్చుంటే అన్నీ పనులూ అయిపోతున్నాయి. ఇప్పుడు అక్షరాస్యత అంటే ఏవో నాలుగు అక్షరాలు నేర్చుకోవడం కాదు. దైనందిన అవసరాలకు కంప్యూటర్‌ వాడే పరిజ్ఞానం సంపాదించడం. మానవ జీవితాలతో కంప్యూటర్‌ ఇంతగా పెనవేసుకుపోయిన్నప్పుడు మరి దానిని విద్యార్థులకు పరిచయం చేయొద్దా?
ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలలో మాదిరిగానే ప్రభుత్వ స్కూళ్లలో కూడా....
ఈ సందేహానికి పదేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పింది. ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలలో మాదిరిగానే ప్రభుత్వ స్కూళ్లలో కూడా కంప్యూటర్‌ విద్యను బోధించాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం 2004 డిసెంబర్‌లోనే ఐసీటీ ప్రోగ్రాంను ప్రారంభించింది. ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్‌ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించాలన్నదే ఈ పథకం లక్ష్యం. ఇందుకు అవసరమైన నిధుల్లో 75శాతం డబ్బు తానే సమకూరుస్తానని కేంద్రం చెప్పింది. మరో 25శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి వుంటుంది. స్కూళ్లలో కంప్యూటర్‌ విద్యా బోధనకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, కంప్యూటర్లు , టేబుళ్లు సమకూర్చిపెట్టడం, బోధించే టీచర్లకు ట్రైనింగ్‌ ఇవ్వడం ఇలాంటవన్నీ తానే చూసుకుంటానని కేంద్రం చెప్పింది. అయితే, ఆరవ ఏట నుంచి ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆనాడే స్పష్టం చేసింది. తొలుత ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా విస్తరిస్తూ వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో ఈ పథకం కింద 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.
చాలా స్కూళ్లల్లో కాంట్రాక్ట్‌ టీచర్లను నియామకం....
కంప్యూటర్‌ విద్యా బోధన కోసం చాలా స్కూళ్లల్లో కాంట్రాక్ట్‌ టీచర్లను నియమించారు. అయితే కేంద్రం నిధులు అందించినంత కాలం అంటే ఐదేళ్ల పాటు బండి లాగించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ నుంచి నిధులు ఆగిపోగానే కంప్యూటర్లను అటకెక్కించాయి. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించిన టీచర్లను ఇంటికి పంపించాయి. కంప్యూటర్‌ ల్యాబ్‌లు క్లోజ్‌ చేసి, తాళాలు బిగించాయి. మరికొన్ని స్కూళ్లలో విద్యుత్‌ బిల్లులు కట్టకపోవడంతో కరెంట్‌ కట్‌ అయి కంప్యూటర్లు మూలనపడ్డాయి. చాలాచోట్ల ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదు. ఇదీ కంప్యూటర్‌ విద్య పట్ల మన ప్రభుత్వాలకున్న శ్రద్ధ. ప్రపంచంలో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో మనం ముందున్నాం. కానీ, మన ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం కంప్యూటర్‌ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు.
అంతంత మాత్రంగానే విద్యా ప్రమాణాలు...
నిజానికి ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగా వున్నాయి. కాస్త ఆర్థిక స్థోమత వున్నవారెవ్వరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించడం లేదు. ప్రయివేట్‌ స్కూళ్లలో ఫీజుల భారం మోయలేనివారు, అందుబాటులో ప్రయివేట్‌ స్కూళ్లు లేనివారు మాత్రమే ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారన్న బాధాకర వాస్తవాన్ని విస్మరించకూడదు. కనీసం ఈ కొద్దిమంది పిల్లలకు కూడా ప్రభుత్వం కంప్యూటర్‌ విద్యను, ఆధునిక బోధనా పద్ధతులను పరిచయం చేయకపోతే ఎలా? ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో కంప్యూటర్‌ బేసిక్స్‌ అయినా తెలియని చదువులు దేనికైనా అక్కరకొస్తాయా? ఓ వైపు కార్పొరేట్‌ స్కూళ్లలో కేజీ స్థాయి నుంచే కంప్యూటర్‌ను పరిచయం చేస్తుంటే, ప్రభుత్వ స్కూళ్లల్లో పదో తరగతి వారికైనా కనీసం దాని మానిటర్‌, కీ బోర్డులైనా చూపించకపోవడం న్యాయమేనా? తమ స్కూళ్లలో చదివే విద్యార్థులంటే ప్రభుత్వాలకెందుకింత చిన్నచూపు? ఉన్న కాంట్రాక్ట్‌ టీచర్లను పీకేసీ, కొత్త టీచర్లను నియమించకుండా, కంప్యూటర్లను అటకెక్కించడంలో ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నవారిలో అత్యధిక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు. పదో తరగతి ముగిసేదాకా కూడా వీరికి కంప్యూటర్లను పరిచయం చేయకపోతే, నగరాల్లోని బడా కార్పొరేట్‌ స్కూళ్లలో చదివే పిల్లలతో వీరు పోటీపడగలరా? 

No comments: