MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, September 5, 2014

కంప్యూటర్‌ విద్యను బలోపేతం చేయండి


-  పాఠశాలల్లో ఆపరేటర్లను నియమించాలి   
-  పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు  
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
 కంప్యూటర్‌ విద్యను బలోపేతం చేయాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు విద్యాశాఖమంత్రిని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు చాలా కీలకమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ విద్యను ప్రవేశపెట్టింది అనే విధంగా చూడకుండా, బాధ్యతగా నిర్వహించాలని శాసన మండలి సభ్యులు బాలసుబ్రహ్మణ్యం కోరారు. 18నెలల నుంచి ఇందుకోసం కేటాయించిన నిధులను ఉపయోగించడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టికుని ఈ ప్రభుత్వం అయిన పట్టించుకోవాలని కోరారు. 25వేల కంప్యూటర్లు పాఠశాలల్లో ఉన్నాయని తెలిపారు. పాఠశాలల్లో ఆపరేటర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ద్వారా ఆపరేటర్లను నియమించాలని శాసన మండలి సభ్యులు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇంత మంచి పథకాన్ని ఏజెన్సీలకు అప్పగించడం మంచిది కాదని సూచించారు. 2,841 పాఠశాలల్లో కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయని శాసన మండలి సభ్యులు లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలకు కనీసం ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అయిన నియమించాలని కోరారు. 17లక్షల విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు దూరం అయ్యారని శాసనమండలి సభ్యులు బొడ్డునాగేశ్వరరావు తెలిపారు. కంప్యూటర్‌ విద్య తీసివేయడం వల్ల 5వేల మంది కంప్యూటర్‌ టీచర్లు జీవనోపాధి కోల్యోయారని అన్నారు. 
విద్యార్థులకు ఐప్యాడ్‌లను అందిస్తాం : మంత్రి గంటా 
                  కంప్యూటర్‌ విద్య కాకుండా ప్రతి విద్యార్థికి ఐప్యాడలను అందిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నా రు. తెలుగుదేశం పార్టీ ఎన్నిక ల మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపరించిందని చెప్పారు. డిజిటల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు అందజేయాలో, ప్రభుత్వామే నిర్వహించాలో ఆలోచిస్తున్నామని అన్నారు.

No comments: