- అంగన్‌వాడీ యూనియన్ కార్యదర్శి జయలకిë ప్రజాశక్తి-నిజామాబాద్‌సిటీ
సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ ఉద్యోగులు గతంలో రాష్ట్రవ్యాప్తంగా 13రోజులు సమ్మె చేశారని, రాబోయే ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించకుంటే మలిదశ పోరాటాలకూ సిద్ధమేనని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. నిజామాబాద్ నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా సదస్సులో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమ్మె నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హామీనిచ్చి మాట తప్పుతున్నారన్నారు. యూనియన్‌ను బలహీన పర్చటానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకూ పని భారం పెంచి అంగన్‌వాడీ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కార్మిక వ్యతిరేకులను ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ.. శ్రమదోపిడీకి పాల్పడే వాళ్లని శిక్షించాలని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులను శ్రమదోపిడికీ చేస్తోందని విమర్శించారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు భారతి, ఝాన్సి, యామ్మ, దుర్గా, రాజసులోచన పాల్గొన్నారు.
No comments:
Post a Comment