- రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు
ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రభుత్వరంగ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని, వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, పిఎఫ్‌ను ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు వినతిపత్రం అందజేశారు.
విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా, అనంతరం కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కులో నిర్వహించ తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు విశాఖ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు కోరారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు ఎమ్మెల్సీ డాక్టరు గేయానంద్ హాజరై మద్దతు తెలిపారు.
ఉద్యోగులకు భద్రత కల్పించాలని,. రెగ్యులర్ చేయాలని కోరారు. కర్నూలు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని ఆ సంఘం జిల్లా నాయకులు ఎ.నాగరాజు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ గవర్నర్ దృష్టికి సమస్యలు తీసుకుపోతామని చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా, అనంతరం జెసికి వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరి వెంకటేశ్వర్లు ప్రసంగించారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీను మాట్లాడారు. గడువు ముగిసిన ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని, వారిని రెగ్యులర్ పోస్టుల్లో నియమించాలని, 2010 పిఆర్‌సి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ నీతూ కుమారికి వినతిపత్రం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను తొలగించకుండా కొనసాగించాలని సిఐటియు మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినితి పత్రం అందజేశారు.
No comments:
Post a Comment