MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, March 22, 2014

-రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

 -రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

 ప్రజాశక్తి - యంత్రాంగం
     విఆర్‌ఎల పెరిగిన వేతనాలను 010 పద్దు కింద వెంటనే అందజేయాలనీ, ఎస్‌హెచ్‌(06) 310/312 పద్దును ఉపసంహరించాలనీ డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విఆర్‌ఎలు గురువారం కలెక్టరేట్లను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా గ్రామ రెవెన్యూ సహాయకుల(విఆర్‌ఎల) సంఘాల(సిటిఐయు) ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. విఆర్‌ఎలకు పెరిగిన వేతనాలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.పెద్దన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రెండేళ్ల పోరాట ఫలితంగా రూ. 3 వేలనుంచి రూ. 6 వేలకు ప్రభుత్వం వేతనం పెంచిందని చెప్పారు. అందుకనుగుణంగా జీవో 17 విడుదల చేసిందనీ, వేతనాల పద్దు 010 ప్రకారం వేతనాలు చెల్లించడంలేదనీ విమర్శించారు. విభజన, ఎన్నికల సాకుతో ప్రభుత్వం విఆర్‌ఎల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెరిగిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాత్రి విధులు రద్దు చేయాలనీ, బ్యాంకు ఖాతాల ఆలోచన విరమించుకోవాలనీ, ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలనీ, అర్హుÛలైన వారికి అటెండర్‌, నైట్‌ వాచ్‌ మేన్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలనీ విఆర్‌ఎలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. 
విశాఖ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ధర్నానుద్ధేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసి, వినతిపత్రం అందించారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజీ, సంఘ జిల్లా అధ్యక్షులు ప్రాతూరి ప్రభాకరరావు మాట్లాడారు. అనంతరం డిఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతపురం కలెక్టరేట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌ డిఎస్‌.లోకేష్‌కుమార్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పెంచిన వేతనాలను 010 పద్దు కింద వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎఓకు వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు పి.రఘు, జిల్లా అధ్యక్షులు కె.ఎల్లయ్య పాల్గొన్నారు. నల్గొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. విఆర్‌ఎలకు పెంచిన వేతనాల బడ్జెట్‌ ను వెంటనే విడుదల చేయాలని వరంగల్‌ జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్‌ను సంఘం జిల్లా నాయకులు కోరారు. మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నానుద్దేశించి సంఘం తెలంగాణ అధ్యక్షులు అమ్ముల బాలనర్సయ్య మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 

No comments: