MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, February 19, 2014

ఇంటర్‌నెట్‌ కాదు ఔటర్‌నెట్‌ రాబోతోంది!

న్యూయార్క్‌: ఇంటర్‌నెట్‌ను మర్చిపోండి! తొందరలో ఔటర్‌నెట్‌ రాబోతుంది. భూగోళంపై నివసించే వారందరికీ వైఫి రూపంలో అందరికీ ఉచితంగా త్వరలో
ఇంటర్‌నెట్‌ అందించటం జరుగుతుందని చెబుతున్నారు. ఔటర్‌నెట్‌ అని పిలువబడుతున్న ఈ ప్రోజెక్ట్‌ 2015 జూన్‌ కల్లా వందలాది చిన్న చిన్న శాటిలైట్స్‌ను భూమి అల్ప కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రతి శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ను ఫోన్లకూ, కంప్యూటర్లకూ ప్రసారం చేయటంద్వారా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల ప్రజలకు ఉచిత ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇది సాంకేతికంగా దుస్సాధ్యమైనదేమీ కాదు. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ను వాడుకోవాలంటే రకరకాల పేర్లతో డబ్బు గుంజుతున్నారు. అయితే 'మీడియా డెవెలప్‌మెంట్‌ ఫండ్‌' అనే సంస్థ ఇంటర్‌నెట్‌ను తలక్రిందు చేసి భూమిపై నివసించే వారందరికీ ఉచితంగా వెబ్‌ ప్రవేశాన్ని కల్పించే ప్రణాళికను రచిస్తోంది. ఈ ప్రణాళిక పేరే 'ఔటర్‌నెట్‌'. ఇది 100లాది చిన్న చిన్న శాటిలౌట్ల సమాహారం. 2015కల్లా ఈ శాటిలైట్లు భూమి కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇది షరతులులేని వెబ్‌ సౌకర్యాన్ని ఉచితంగా ప్రపంచ ప్రజలకు అందించబోతోంది. 
తన ఔటర్‌నెట్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లో పరిక్షించి చూడాలని నాసాను ఈ న్యూ యార్క్‌ కంపెనీ అడగబోతోంది. తద్వారా వైఫిని వెబ్‌ (ఇంటర్‌నెట్‌)ను ఉపయోగించుకునే వారికి ప్రసారం చేయటం మొదలెట్టవచ్చని ఆ కంపెనీ భావిస్తోంది. 'డాటా కాస్టింగ్‌ టెక్నాలజీ' అని పిలువబడే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో వెడల్పాటి రేడియో తరంగాల ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ను ప్రసారం చేయగలిగే వీలుంటుందని అర్థం. దీనికయ్యే కోట్లాది డాలర్ల ఖర్చును విరాళాల రూపంలో సేకరించవచ్చని ఈ కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుత ప్రపంచంలో కేవలం 60శాతం మంది ప్రజలకే ఇంటర్‌నెట్‌తో లభించే విజ్ఞాన సంపద అందుబాటులో ఉంది. ఎన్నో రకాల వైఫి సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంటర్‌నెట్‌ ప్రజలకు అందుబాటులోకి రావటానికి కావలసిన మౌలిక నిర్మాణాన్ని ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి.
క్యూబ్‌ శాట్స్‌గా పిలువబడే బుల్లి బుల్లి శాటిలైట్స్‌ను వందలాదిగా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇంటర్‌నెట్‌ను ఉచితంగా అందించాలనే కలను వాస్తవం చేయాలనే లక్ష్యంతో 'ఔటర్‌నెట్‌' ప్రోజెక్ట్‌ పనిచేస్తోంది. ఈ ఏర్పాటులో ప్రతి శాటిలైట్‌ ప్రపంచమంతా ఉండే గ్రౌండ్‌ స్టేషన్ల నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. 'యూజర్‌ డాటా గ్రామ్‌ ప్రొటోకాల్‌(యుడిపి)' అనే టెక్నిక్‌తో నెట్‌వర్క్‌ లో ఉన్న వినియోగదారులు ఒకరి సమాచారాన్ని మరొకరితో పంచుకునే వీలు కలుగుతుంది. మనకు టీవి సిగల్స్‌ ఎలా వస్తాయో, చానల్స్‌ను ఎలా మార్చుకోగలుగుతున్నామో అలానే 'ఔటర్‌నెట్‌' ఇంటర్‌నెట్‌ను ప్రసారం చేస్తుంది. తద్వారా మనం ఏ వెబ్‌ సైట్‌ కెళ్ళదలుచుకుంటే ఆ వెబ్‌ సైట్‌కి వెళ్ళ వచ్చు.
'ఔటర్‌నెట్‌' టైం లైన్‌
ఈ సంవత్సరం జూన్‌ కల్లా 'ఔటర్‌నెట్‌' తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి శాటిలైట్స్‌ను ప్రవేశపెట్టటం ప్రారంభిస్తుంది. 2014సెప్టెంబరులో 'ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌'పై తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించమని నాసాని అడుగుతారు. 2015ఆరంభంనుండి శాటిలైట్స్‌ను తయారు చేయటం, లాంచ్‌ చేయటం మొదలెట్టాలనే ఆలోచన ఉన్నది. 2015జూన్‌లో 'ఔటర్‌నెట్‌' స్పేస్‌ నుండి తన ఇంటర్‌నెట్‌ ప్రసారాలను ప్రారంభిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త విషయం ఏమీలేదు. ఎన్నో సార్లు వివిధ రూపాల్లో ఇది ఋజువవుతూనే ఉన్నదనీ, ఇది దుస్సాధ్యమైనదేమీ కాదనీ, దీనికయ్యే వ్యయం విషయంలో కూడా తమకు గణనీయమైన అనుభవం ఉన్నదనీ 'ఔటర్‌నెట్‌' ప్రోజెక్ట్‌ లీడ్‌ సయ్యద్‌ కరీం అన్నాడు. అయితే టెలిఫోన్‌ కంపెనీలు ఈ ప్రోజెక్ట్‌కి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. ఎందుకంటే అప్పుడు టెలిఫోన్‌లో మాట్లాడుకోవటంకూడా కారు చౌకవుతుంది గనుక. ఈ అవాంతరాన్ని పోరాడి గెలుస్తామని కరీం ప్రకటించాడు.

No comments: