Posted on: Wed 05 Feb 05:27:32.013065 2014
వాష్టింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ఈ రంగంలో 22 ఏళ్ల అనుభవం ఉన్న సత్య హైదరాబాద్‌లోని బేగంపేట్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ప్రపంచంలోని 90 శాతం వ్యక్తిగత కంప్యూటర్లు మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్‌తోనే నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్, టూల్స్ వ్యాపారంలో సత్య కనబర్చిన ప్రతిభకు ఈ అవకాశం దక్కిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సత్య తప్పా మరోకరు చేయలేరు
మైక్రోసాఫ్ట్‌ను ప్రస్తుతం సత్యా తప్పా మరేవర్ తన స్థాయిలో నడిపించలేరని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచం ఎలాంటి టెక్నలాజీ కోరుకుంటే దానికి అనుగుణమైంది మైక్రోసాఫ్ట్ అందిస్తుందన్నారు. కాగా మైక్రోసాఫ్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న గేట్స్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇక కంపెనీ సాంకేతిక సలహాదారుగా ఆయన కొనసాగ నున్నారు. ఛైర్మన్‌గా జాన్ థామ్సన్ నియమితులయ్యారని ఆ కంపెనీ బోర్డు ప్రకటించింది.
No comments:
Post a Comment