MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, February 13, 2014

మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మె విరమణ

మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మె విరమించారు. కనీస వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఐదు రోజులుగా మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండు దఫాలుగా కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. బుధవారం నిర్వహించిన చలో అసెంబ్లీ రణరంగంలా మారడంతో చర్చలకు రావాలని ప్రభుత్వం కార్మిక సంఘాలను ఆహ్వానించింది. బుధవారం
సాయంత్రం సచివాలయంలో మున్సిపల్‌ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగర మేయర్‌ ఎండి మజీద్‌ హుస్సేన్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, సమీర్‌ శర్మ, కమిషనర్‌ సోమేశ్వరరావు కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్‌, జె వెంకటేశ్‌, మంగపతి, పార్థసారధి( సిఐటియు) కృష్ణారావు (ఎఐటియుసి) అశోక్‌కుమార్‌ (బిఎమ్‌ఎస్‌) రామారావు (హెచ్‌ఎమ్‌ఎస్‌) శ్రీనివాస్‌(టిఎన్‌టియుసి) మారుతీరావు (టిఆర్‌ఎస్‌వికెవి) కృష (ఐఎఫ్‌టియు) సుధీర్‌(ఎఐయు టియుసి)లతో చర్చలు జరిపారు. 
ఈ చర్చల్లో జిహెచ్‌ఎమ్‌సి పరిధిలోని ఉద్యోగులకు 27 శాతం, మున్సిపాల్టీ పరిధిలో 25 శాతం, నగర పంచాయితీలో 23 శాతం మధ్యంతర భృతి చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. శాశ్వత ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, జిపిఎఫ్‌ ఖాతాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పిఆర్‌సిలో ఫైనల్‌ అయినటువంటి శాశ్వత ఉద్యోగుల బేసిక్‌ వేతనాన్ని జిహెచ్‌ఎమ్‌సీతో పాటు కార్పొరేషన్లు, నగర పంచాయితీల్లో కూడా అమలు చేస్తామని మంత్రి హామి ఇచ్చారు. దీంతో సమ్మెను విరమించేందుకు కార్మిక సంఘాలు అంగీకరించాయి. 
మున్సిపల్‌ కార్మిక కుటుంబాల శ్రేయస్సు కోసమే వారి వేతనాలను పెంచామని మున్సిపల్‌ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి చెప్పారు. పెంచిన వేతనాల వల్ల ప్రభుత్వంపై రూ.140 కోట్ల భారం పడుతుందన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా ఒక్కో ఉద్యోగి నెలకు కనీసం రూ.10 వేల వేతనం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. దీంతో పాటు డ్రైవర్లు, క్లీనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమ, సాధారణ ఉద్యోగులకు రూ.5 లక్షల బీమా అందజేస్తామన్నారు. ఉద్యోగి మరణిస్తే అంతక్రియలకు రూ.10 వేలను వెంటనే అందజేస్తామని తెలిపారు. 

No comments: