MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, February 12, 2014

ముట్టడులతో దద్దరిల్లిన మున్సిపాలిటీలు

Posted on: Tue 11 Feb 05:29:58.130784 2014

-కనీస వేతనాల కోసం కార్మికుల డిమాండ్‌
-ఒంగోలు, విశాఖలో అరెస్టులు
-ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం
ప్రజాశక్తి-యంత్రాంగం
కనీస వేతనం రూ.12,500 ఇవ్వాలని కోరుతూ
పూర్తి వివరాలు కోసం 
ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు), ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దశలవారీ ఆందోళనల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను ముట్టడించారు. పలు చోట్ల ర్యాలీలు, ధర్నాలు, అర్ధనగ ప్రదర్శనలు చేపట్టారు. ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయ ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అరెస్టులకు ప్రయత్నించడంతో మహిళా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. దాంతో సిఐటియు నాయకులను, కార్మికులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. కందుకూరులోనూ కార్మిక నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖలో జివిఎంసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన పారిశుధ్య కార్మికులు చీపుళ్లతో భారీ ప్రదర్శన జివిఎంసి ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముట్టడించారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సిఐటియు నాయకులు సహా 4000 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కార్మికులను ఈడ్చికెళ్లి వ్యాన్లలో పడేశారు. శ్రీకాకుళంలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం జిల్లాలో నాలుగు మున్సిపాల్టీల కార్యాలయాలను ముట్టడించారు.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చార్మినార్‌ జోన్‌ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, యాకుత్‌పురాలో ర్యాలీలు, శబ్దర్‌మహల్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆరు ఏడు మున్సిపాలిటీల్లోనూ ముట్టడులు జరిగాయి. కరీంనగర్‌లో కార్పొరేషన్‌ ఎదుట కార్మికులు అర్ధనగ ప్రదర్శన, గోదావరిఖనిలో రాస్తారోకో చేశారు. హుస్నాబాద్‌ నగర పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. 
నల్గొండ, కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీల ఎదుట దీక్షలు కొనసాగుతున్నాయి. భువనగిరిలో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మంలో భారీ ప్రదర్శన, కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనకు కెవిపిఎస్‌, ఆటోవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీలు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘీభావం తెలిపాయి. వరంగల్‌లో సిపిఎం, సిఐటియు, కెవిపిఎస్‌, ప్రయివేటు శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మహబాద్‌లో ఆర్డీఓ కార్యాలయం ముట్టడిలో సిపిఎం జిల్లా కార్యదర్శి నాగయ్య పాల్గొన్నారు. భూపాలపల్లిలో కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సమ్మెకు ఇఫ్‌టూ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. 
మెదక్‌ జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి నిర్వహించారు. సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 
విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (విఎంసి) పారిశుధ్య కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయా డివిజన్ల నుండి విచ్చేసిన వేలాది మంది కార్యాలయం వద్దకు చేరుకొని బైఠాయించారు. మచిలీపట్నం, నూజివీడు మున్సిపల్‌ కార్యాలయాలకు తాళాలు వేశారు. గుంటూరులో మునిసిపల్‌ ఆర్‌డి కార్యాలయాన్ని, సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించారు. 
ఆర్‌డి కార్యాలయం వద్ద కార్మికులనుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి.రమాదేవి ప్రసంగించారు. తూర్పు గోదావరి జిల్లాలో సమ్మె శిబిరాలు కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోలోని అన్ని మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, చీమకుర్తి, అద్దంకి, చీరాలలోనూ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కడప కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అర్ధరాత్రి నుండి నీరు, వీధి దీపాలు ఆపేస్తామని సిఐటియు, ఎఐటియుసి నాయకులు హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయాలు, ఆరు మున్సిపాలిటీల ఎదుట ధర్నా జరిగింది. అనంతపురం నగర పాలకసంస్థ కార్యాలయాన్ని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులు ముట్టడించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులు, మున్సిపల్‌ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెన్నోబులేసు, ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు.

No comments: