Posted on: Thu 09 Jan 04:27:06.648012 2014 ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
గురువారం నుండి నిర్వహించాల్సిన సమ్మెను శుక్రవారం ఉదయం మొదటి డ్యూటీ నుండి నిర్వహించేందుకు ఆర్టీసిలోని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గురువారం సంస్థ బోర్డు మీటింగ్‌ను నిర్వ హిస్తామంటూ యాజమాన్యం తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. గురువారం బోర్డు మీటింగ్ జరిగినా, జరక్కపోయినా శుక్రవారం నుండి సమ్మెలోకి వెళతామని పేర్కొంటూ ఎస్‌డబ్ల్యూ ఎఫ్, బిఎ మ్‌ఎస్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, కార్మిక పరి షత్, వర్కర్స్ యూనియన్, సిడిసియు సంయుక్తంగా తెలిపాయి. వేతన సవరణ, ఐఆర్, కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల క్రమ బద్ధీకరణ డిమాండ్ల సాధన కోసం సమ్మెలోకి వెళుతున్నామని తెలిపాయి. మరోవైపు బుధ వారం ఆయా సంఘాల ఆధ్వర్యాన హైదరాబాద్ బస్‌భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
No comments:
Post a Comment