వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Published at: 29-12-2013 04:39 AM
Published at: 29-12-2013 04:39 AM
హైదరాబాద్, డిసెంబర్ 28 : రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టుల భర్తీకి జిల్లాలవారీగా కలెక్టర్లు శనివారం నోటి ఫికేషన్ జారీచేశారు. ఈ మేరకు 1657 వీఆర్వో, 4,305 వీఆర్ఏ ఉద్యోగాల కోసం తొలిరోజే 500 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈసారి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఏపీపీఎస్సీ కూడా పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ఫిబ్రవరి 2న రాత పరీక్ష నిర్వహిస్తారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వెబ్‌సైట్ http://ccla.cgg.gov.in//లో పోస్టుల భర్తీ, షెడ్యూల్ వివరాలను పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్ నుంచే ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా సాగుతుందని రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు. దరఖాస్తుతోపాటు ఫొటో, జేపీజీ ఫార్మాట్‌లో సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏక కాలంలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్ఏ పోస్టులకు వయోపరిమితి 18-37 సంవత్సరాలు కాగా, వీఆర్ఓ పోస్టులకు 18-36గా నిర్ణయించారు.
No comments:
Post a Comment