MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, December 29, 2013

2-3 రోజుల్లో ఐఆర్!

సీఎంతో ఉద్యోగసంఘాల చర్చ (2-3 రోజుల్లో ఐఆర్!)
(హైదరాబాద్, ఆంధ్రజ్యోతి):పదో పీఆర్సీ నేపథ్యంలో ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా మధ్యంతర భృతి(ఐఆర్) మంజూరు కానుంది. ఈ మేరకు సోమ లేదా మంగళవారాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన వెలువడనుంది. ఐఆర్ డిమాండ్ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. ఆర్థికశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మహంతి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పేరి వెంకటరెడ్డి, కత్తి నర్సింహారెడ్డి, టీఎన్జీవోల అధ్యక్షుడు గుండవరపు దేవీప్రసాదరావు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి. శ్రీనివాస్ గౌడ్, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు మాధవరం నరేందర్ రావు, రాజ్‌కుమార్ గుప్తా, యు. మురళీకృష్ణ, కృష్ణయ్య, యూటీఎఫ్ నేత నర్సిరెడ్డి, పింఛనుదారుల సంఘం నేత గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 'మా ప్రాంతాలు వేరైనా, ఎవరి ప్రాంతం కోసం వారు ఉద్యమాలు చేస్తున్నా, ఐఆర్ విషయంలో మాత్రం మేమంతా ఒకటే. ఇప్పటికే ఆరు నెలల జాప్యం జరిగింది.

ఐఆర్‌ను వెంటనే మంజూరు చేయాలి. పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలు తదితర అంశాల ప్రాతిపదికన మేం 50 శాతం ఐఆర్‌ను డిమాండ్ చేస్తున్నాం' అని ఉద్యోగ నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. తొమ్మిదో పీఆర్సీ ఏర్పాటు తర్వాత 3 నెలల్లోనే ఐఆర్ మంజూరు చేశారని, ఇప్పుడు మాత్రం పదో పీఆర్సీ ఏర్పాటై 10 నెలలు కావస్తున్నప్పటికీ ఐఆర్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఉత్తమ పరిపాలనకుగాను మీకు అవార్డు వచ్చింది. ఆ శ్రమలో మా పాత్ర కూడా ఉంది. అందువల్ల న్యాయమైన మా డిమాండ్‌ను వెంటనే ఆమోదించండి.' అంటూ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి విఙ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 'నాది నాన్చుడు ధోరణి కాదు. నేను సీఎం అయిన తర్వాత మీ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం వంటి అంశాలను పరిష్కరించాను. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు ఒకటే. అయితే 2010-11 లో 25 శాతంగా ఉన్న రాష్ట్ర రెవెన్యూ పెరుగుదల 2011-12 లో 16.7 శాతానికి పడిపోగా, 2012-13 లో 9 శాతంగా ఉంది' అని పేర్కొన్నారు. ఏమైనప్పటికీ ఉద్యోగులు తమ ప్రయోజనాల కోసం చూస్తుంటారని, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారి డిమాండ్ల పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు అడగకముందే, అది కూడా గడువుకంటే ముందుగానే పీఆర్సీని ప్రకటించామని గుర్తు చేశారు. ఆర్థికశాఖ మంత్రి, అధికారులతో మరోమారు సమావేశమై రెండు, మూడు రోజుల్లో ఐఆర్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఐఆర్ 17 శాతం!
రెండుమూడు రోజుల్లో ప్రకటించనున్న మధ్యంతర భృతి(ఐఆర్) విషయమై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ప్రతిష్టంభన నెలకొనే పరిస్థితి కన్పిస్తోంది. పెరిగిన ధరలు, జీవన, వ్యయ ప్రమాణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు... ఇందులో భాగంగా కనీసం 30 నుంచి 35 శాతం మేరకు ఐఆర్‌ను ప్రకటించాలని కోరుకుంటున్నారు. అయితే ఆర్థికశాఖ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, అంతా ఒక కుటుంబ సభ్యులమేనని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఆయా సందర్భాల్లో చెబుతున్న నేపథ్యంలో తమ డిమాండ్లకు కొంచెం అటుఇటుగా ఐఆర్, ఫిట్‌మెంట్ మంజూరవుతాయని ఆశిస్తున్న ఉద్యోగులకు కొంత మేర నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 17 శాతం ఐఆర్‌ను, మొత్తంమీద 22 నుంచి 23 శాతం మేరకు ఫిట్‌మెంట్‌ను ఆర్థిక శాఖ వర్గాలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సమాచారంపై ఉద్యోగ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఒకవేళ ఆర్థిక శాఖ ప్రతిపాదనలనే ప్రభుత్వం ఖరారు చేసే పక్షంలో, తాము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాయి. అవసరమైతే ఆ ఐఆర్‌ను వదులుకుంటామని ఉద్యోగ నేతలు స్పష్టం చేస్తున్నారు.

31 లోపు ప్రకటించాలి
హైదరాబాద్, డిసెంబర్ 28: డిసెంబర్ 31లోగా మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చినమాట ప్రకారం మూడు రోజుల తర్వాత ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు సిద్ధమవుతామని, జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం ముఖ్యమంత్రి కిరణ్, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. అనంతరం అశోక్‌బాబు, దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్‌రావు తదితరులు మీడియాతో మాట్లాడారు. సీఎంతో సమావేశం అనంతరం ఐఆర్ ప్రకటన వెలువడుతుందని ఆశించామని, ప్రభుత్వం గడువు తీసుకోవడం అసంతృప్తికి గురిచేసిందని అన్నారు. ఐఆర్ 45 నుంచి 50 శాతం వరకు ఇవ్వాలని కోరామని, ప్రభుత్వం ఎంతవరకు ప్రకటించేందుకు సిద్ధంగా ఉందనేదానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. పీఆర్‌సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఐఆర్ ఇంకా ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు. కిరణ్ ఉత్తమ సీఎంగా గుర్తింపు పొందడం వెనక ఉద్యోగుల శ్రమదాగి ఉందని గుర్తుచేశారు. ఐఆర్ ప్రకటించాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.

ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులు మూడు పీఆర్‌సీలు కోల్పోయారని తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం సంతృప్తికరంగా లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, సోమవారం సీఎస్, వైద్యాధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. తమ వేతన పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని హోంగార్డు సంఘం అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు.
జీతాలు పెంచకున్నా 'టీ' బిల్లు అడ్డుకోవద్దు: శ్రీనివాస గౌడ్
ఉద్యోగుల జీతాలు పెంచినా పెంచకపోయినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లును మాత్రం అడ్డుకోవద్దని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
3న అసెంబ్లీ ముట్టడి : పీఆర్‌టీయూ
ఈ నెల 31లోగా ఐఆర్ ప్రకటించకుంటే జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామని పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటరెడ్డి, పి.సరోత్తం రెడ్డి తెలిపారు. చర్చల్లో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకుంటూ కాలయాపన చేయటం తమను నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు.

వెంటనే 50 శాతం ఐఆర్ ప్రకటించాలి: యూటీఎఫ్
ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, ఐ.వెంకటేశ్వరరావులు శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తక్షణం 50 శాతం ఐఆర్‌ని ప్రకటించి జూలై ఒకటి నుంచి అమలు చేయాలని కోరారు. హెల్త్‌కార్డుల నమోదుపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని, పండిత, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.

హెల్త్‌కార్డులపై నేడు సమావేశం
హెల్త్‌కార్డులకు సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఆదివారం తుది సమావేశం నిర్వహించనుంది. మరోవైపు ఉద్యోగులు వివరాలు సమర్పించే గడువును వచ్చే నెల 5 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవంగా శనివారంతో గడువు ముగిసింది. ఉద్యోగుల అభ్యర్థన మేరకు తాజాగా గడువు పొడిగించారు. ఉద్యోగులు సమర్పించిన వివరాలను డ్రాయింగ్ ఆఫీసర్స్ అప్‌లోడ్ చేసుకుని, జనవరి 18లోగా తుది జాబితా సిద్ధం చేయనున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/47962#sthash.ZYc7Yzb3.dpuf

No comments: