హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించనున్నారు. శుక్రవారం నాడు ఈయు, టిఎంయు, ఎస్ డబ్ల్యుఎఫ్ మూడు కార్మికసంఘాల నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసును అందజేశాయి. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే 14రోజుల్లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. గతంలో గుర్తింపు యూనియన్ తో చేసుకున్న ఒప్పందాలను అమలుచేయాలని కోరారు. 2005 సంవత్సరం నుండి సుమారు 25వేల మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, లాభనష్టాలతో సంబంధం లేకుండా నూతన వేతన సవరణ జరగాలని, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment