MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, December 18, 2013

ఎన్నాళ్లు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తా




ఎన్నాళ్లు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తా
-  వెంటనే పర్మినెంట్‌ చేయాలి   -  కనీస వేతనం రూ.12,500 చెల్లించాలి   
    ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 
    కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికులుగా ఎన్నాళ్లు పనిచేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత పనిలో కాంట్రాక్టు, క్యాజువల్‌ ప్రాతిపదికన ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం
యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యుఇఇయు) (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎపిసిపిడిసిఎల్‌ సిఎండి కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన రాఘవులు ధర్నానుద్దేశించి మాట్లాడుతూ ప్రమాదాలకు వెరవకుండా విద్యుత్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. 5,6,10 ఏళ్లపాటు కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికులుగా పనిచేసినా రెగ్యులరైజ్‌ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత పనిలో ఏళ్లతరబడి కాంట్రాక్టు కార్మికులతో పనిచేయించడం అమానుషమని విమర్శించారు. అందుకే శాశ్వత పనిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.8,079 వేతనాన్ని సమీక్షించాలని కోరారు. విద్యుత్‌ శాఖలోని కాంట్రాక్టు కార్మికులకు రూ.12,500 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులను కాంట్రాక్టు కార్మికులతోనే భర్తీ చేయాలని సూచించారు. వర్క్‌లోడ్‌ను తీవ్రమవుతున్నందున తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దేశసేవ, ప్రజాసేవగా గుర్తించి పరిహారం ఇవ్వాలని తెలిపారు. కార్మికులపై వేధింపులు ఆపాలని సూచించారు. న్యాయమైన సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. సిపిడిసిఎల్‌ సిఎండి రిజ్వీకి కలెక్టర్‌గా మంచి పేరుందని, దానిని నిలబెట్టుకోవాలని కోరారు. సిఐటియు గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి జె వెంకటేష్‌ మాట్లాడుతూ విద్యుత్‌ శాఖలోని కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. మెట్రో నగరాల్లో బతకాలంటే కుటుంబానికి రూ.16,500 కావాలని ఆక్ట్రారు సూచించారని చెప్పారు. అందుకే వారికి కనీస వేతనం రూ.25 వేలు చెల్లించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ సిఎం కిరణ్‌ వద్దని వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. కుర్చీలో ఉంటే పరిష్కరించాల్సిందేనని తెలిపారు. యుఇఇయు గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ కార్యదర్శి కె ఈశ్వర్‌రావు మాట్లాడుతూ జెఎల్‌ఎం, ఎల్‌డిసి పోస్టులు సీనియార్టీ ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులతో భర్తీ చేయాలని, 2006 జెఎల్‌ఎంలకు కోర్టు కేసుతో సంబంధం లేకుండా ఎస్‌పిడిసిఎల్‌లో ఇచ్చినట్లు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఇంక్రిమెంట్లు కలపాలని, రెవెన్యూ వసూళ్ల కోసం అధికారుల వేధింపులు ఆపాలని, అటెండర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు విడిఎ అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులు సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లకు రూ.5 లక్షలు ఇన్సూరెన్స్‌ చేయాలని, వాచ్‌మెన్‌ను నియమించాలని, అర్హత గలిగిన సబ్‌ ఇంజనీర్లకు వెంటనే ఎఎఇగా పదోన్నతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిడిసిఎల్‌ కార్యదర్శి హరీశ్వర్‌, నాయకులు మధు, సాంబయ్య, లలిత పాల్గొన్నారు.

No comments: