MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, October 1, 2013

కంప్యూటర్ విద్యపై అనూహ్య అనాసక్తి

కంప్యూటర్ విద్యపై అనూహ్య అనాసక్తి!

Google News: Andhrabhoomi - ‎1 గంట క్రితం‎
విజయవాడ, సెప్టెంబర్ 30: దశాబ్దకాలం క్రితం కంప్యూటర్ కోర్సుకు అంతులేని డిమాండ్ ఉండటంతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించాలనే అతృతతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య సరిగ్గా ఐదేళ్లకే మటుమాయమైంది. ఇక కంప్యూటర్ టీచర్లు తమ భవితవ్యం ఏమిటంటూ రోడ్డునపడ్డారు. దీని ప్రభావం ...
కంప్యూటర్ విద్యపై అనూహ్య అనాసక్తి
Andhrabhoomi dated :  01-10-2013  కృష్ణ :
విజయవాడ, సెప్టెంబర్ 30: దశాబ్దకాలం క్రితం కంప్యూటర్ కోర్సుకు అంతులేని డిమాండ్ ఉండటంతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించాలనే అతృతతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య సరిగ్గా ఐదేళ్లకే మటుమాయమైంది. ఇక కంప్యూటర్ టీచర్లు తమ భవితవ్యం ఏమిటంటూ రోడ్డునపడ్డారు. దీని ప్రభావం ప్రత్యక్షంగానే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఎంసిఎ కళాశాలల్లో కంప్యూటర్ కోర్సుపై స్పష్టంగా గోచరిస్తున్నది. గతంలో బిటెక్‌లో సిఎస్‌ఇ, ఐటి కోర్సులు చదవాలన్నా, ఎంసిఎ కళాశాలలో సీటు సంపాదించాలన్నా ఎంతో కష్టపడాల్సివచ్చేది. సీట్లు అందుబాటులో ఉండక...అత్యధిక మొత్తంలో లక్షలకు లక్షలు డొనేషన్లు వెదజల్లి కంప్యూటర్ కోర్సులు చదివిన సందర్భాలున్నాయి. కృష్ణాజిల్లాలో నాలుగేళ్ల క్రితం వరకు కూడా మేనేజింగ్ సీట్లు కోసం ఐదు నుంచి ఏడు లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చేది. అదే నేడు సాధారణ ఫీజుకు సీటు ఇస్తామన్నా ఏ ఒక్కరూ ముందుకు రావడంలేదు. ఆర్థికమాధ్యం సాఫ్ట్‌వేర్ బూమ్ లేకపోవడం వల్ల ఈ కోర్సుకు డిమాండ్ లేదంటున్నారు. దీనికి తగ్గట్లే ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఇంజనీరింగ్, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలే ఇందుకు ఎంచక్కా అద్దంపడుతున్నాయి. అసలు అన్ని సౌకర్యాలు, మంచి ఫ్యాకల్టీ ఉన్న కళాశాలల్లోనే సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. బిటెక్ ఇంజనీరింగ్ కోర్సులో సిఎస్‌ఇ (కంప్యూటర్ నైన్స్ ఇంజనీరింగ్), ఐటి (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) కోర్సులు కంప్యూటర్ విభాగానికి చెందినవి. జిల్లాలోని 35 ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 2209 సిఎస్‌ఇ సీట్లకుగాను 1025 సీట్లు ఐటిలో 310 సీట్లు మిగిలిపోయాయని చెబుతున్నారు. ఇంజనీరింగ్‌తో సమానమైన ఎంసిఎ కోర్సులు చతికిలపడ్డాయి. దీంతో అత్యధిక కళాశాలలు మూతబడే పరిస్థతి కన్పిస్తోంది. జిల్లాలో 24 ఎంసిఎ కళాశాలల్లో 5100 సీట్లు ఉంటే వీటిల్లో కేవలం 980 సీట్లు భర్తీ అయ్యాయంటున్నారు. అన్ని సౌకర్యాలు సదుపాయాలున్న కళాశాలల్లోనే పదిలోపు సీట్లు భర్తీ అయ్యాయి. ఇక యాజమాన్యకోటా సీట్లు ఎలా భర్తీ అవుతాయి. తాము ఎలా ఈ కళాశాలలను నడుపగలం అని యాజమాన్యాలు తలలుపట్టుకుంటున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంలో పలు కళాశాలల యాజమాన్యాలు గంపెడంత ఆశతో అప్పోసొప్పో చేసి వందల కొద్దీ కంప్యూటర్‌లను కొనుగోలు చేసి అత్యాధునిక సదుపాయాలతో ఎసి, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించారు. తీరా సీట్లు భర్తీ కాకపోవటంతో ఈ కంప్యూటర్ లాబ్‌లను ఏమి చేయాలో అంతుబట్టటంలేదు.
పాఠశాల స్థాయిలో ఇక చరమగీతమేనా?
కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2008లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 550 పాఠశాలలు, కృష్ణాజిల్లాలో 300 పాఠశాలల్లో ఈ విద్యను అమలు చేశారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు సమకూర్చి సుమారు రూ. 500 కోట్లు ఆయా పాఠశాలల్లో కంప్యూటర్లు మెయింటెన్స్‌కు ఖర్చు చేశారు. సరిగా ఐదేళ్ల పాటు కొనసాగిన ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగిసింది. అయితే ఈ రోజు వరకు ఈ పథకం కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు కదా... అసలు పట్టించుకునే ప్రజాప్రతినిధి లేదా అధికారులు కాని ఉంటే కదా... అయితే మాత్రం కాస్తంత కంప్యూటర్ విద్యలో ప్రవేశం పొందిన విద్యార్థులు, అలాగే వేతనాలపై అధారపడ్డ టీచర్లలోను ఆందోళన కన్పిస్తున్నది. ఒక్కొ పాఠశాలకు ఇద్దరేసి మొత్తం 300 పాఠశాలల్లో గత ఐదేళ్లుగా 600 మంది బోధన చేశారు. గత ఐదేళ్లుగా వీరు అతి తక్కువ వేతనాలతో... అదీ భవిష్యత్ పై గంపెడాశతో విధులు నిర్వర్తించారు. అయితేనేమి ఉద్యోగ భద్రత లేకుండాపోయింది. మొత్తంపై రోడ్డునపడ్డారు. ఈ పథకం ప్రారంభంలో నెలకు రూ. 1800లు ఇచ్చారు. 2011లో పెరిగిన ధరకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ 104 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం రూ. 2600కు పెంచారు. అయితేనేమి పథకం కాల పరిమితి ముగిసింది. ఓ వైపు లక్షలాది ఉద్యోగాలిస్తున్నామంటూ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఒక్కటే ఊదరగొట్టింది. పొరుగు నున్న తమిళనాడులో రెగ్యులర్ ప్రాతిపదికన రూ. 7వేలు వేతనంపై కంప్యూటర్ టీచర్‌లను నియమించి పాఠశాలలో కంప్యూటర్ విద్యకు పెద్దపీట వేస్తుంటే ఈ రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతున్నది. వాస్తవానికి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుతో ఒక్క పాఠశాలలో 11 కంప్యూటర్‌లను అమర్చాయి. టీచర్ల వేతనాల వరకు బడ్జెట్ కేటాయిస్తే సరిపోతుంది. ఇక అదనపు ఖర్చులేదు... డిగ్రీలు, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి తక్కువ జీతమైనా ఏదో రోజు పర్మినెంట్ కాకపోతుందాయనే ఆశతో ఈ ఉద్యోగంలో చేరామని తీరా తమ ఆశలు అడియాసలయ్యాయని కంప్యూటర్ టీచర్లు వాపోతున్నారు.

1 comment:

Anonymous said...

Non stupisce, se una boutique zona possiede un ultimo borse ispirato alla moda e un borsetta originale vecchio stile a una variazione dei prezzi che erano 10-20% sono ricompensati.La scelta ?? per il cliente di pu?? anche fare se considerare superata una pi?? recente uno o un messaggio unidirezionale pi?? recenti.Entrambe le direzioni, i clienti si leva in piedi fare un fattore nel mostrare la loro inclinazione per borse e borsette in loro preziosa collezione.
[url=http://www.algaphone.it/sezioni/chanel-2.55.html]chanel cosmetici[/url]
, [url=http://www.algaphone.it/download/chanel-borse.html]chanel 2.55[/url]
, [url=http://www.algaphone.it/aspnet_client/occhiali-chanel.html]chanel borse[/url]

[url=http://www.residencemare.com/de/borsa-chanel.html]chanel make up[/url]
, [url=http://www.residencemare.com/demo/chanel-2.55.html]scarpe chanel[/url]
, [url=http://www.residencemare.com/en/chanel-borse.html]chanel smalti[/url]

Con grinfie dettagliare montato ?? importante e unica anche a quella particolare borsa e possedere ore devono stato utilizzato per fare in modo che il dettaglio ?? solo di destra.Un individuo Gli accessori hanno molto pi?? da cuciture particolari e poco compresi come il diamante, fibbie spesso indicato come cerniere per fornire loro fantastico per quel particolare designer.Ottenibile con gli accessori che i gioielli preziosi usati sono davvero il meglio quando identificata con falsi.La mia mente ?? o immagini ingranaggi capito quando ho potuto avere stessa speculazione circa e un sacco di altri da qualche parte intorno alla mia routine.Ho riconosciuto alcuni gravi tipi di abitudini che si attaccano a rompere.Mangiare troppo in fretta.Ho trascorso gli anni dell'infanzia in una vera famiglia e contanti era stretto certamente ci spesso non era peculiare cibo per tutti.Tuttavia, hanno anche annunciato che, oltre a queste chiusure superficie di oltre 30 nuovi negozi di quando eri un aperto qualunque Cina fino al 2013.
[url=http://www.residencemare.com/foto/occhiali-chanel.html]chanel orecchini[/url]
, [url=http://www.immobiliaremarche.com/include/occhiali-chanel.html]chanel 2.55[/url]
Sulla superficie, l'allenatore era stato solido 1 quarto di top e bottom line crescita in una nazione al dettaglio societ?? contemporanea migliore discussa come la mente che soffia.Tenere in mente che Coach non ?? qualsiasi stile tradizionale merci playtime, distribuendo un meno quantit?? di tote prezzo/qualit?? (papavero) e roba di negozi negli Stati Uniti e piscina.fabbrica d'oltremare canale di recapito (nessuno mai guardare il negozio Gucci?).Anche se alcuni esperti hanno discusso su stock accidentato della Cina indica il rallentamento successivo accanto a cremagliera di pubblicazione della Cina, che dire ?? balderdash.Economia della Cina sta canticchiando insieme ci sia poco collegamento al sito internet con l'efficacia della borsa e le dimensioni dell'economia.Ora, per la Cina veramente raggiungere economicamente a livello mondiale per quanto riguarda la forza, certamente ?? necessario un sistema di stock meglio urtando ma rapidamente non leggere la finanza dipinga e sullo stesso piano un sacco con il benessere economico della Cina diverso.