108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి లేదంటే ఆందోళన ఉధృతం:సిఐటియు
ప్రజాశక్తి-ఖమ్మం Sat, 3 Aug 2013, IST
108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని లేదంటే జివికె హెడ్డాఫీసును, సచివాలయాన్ని దిగ్భందం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎజె.రమేష్ హెచ్చరించారు. సమ్మె శనివారానికి 16 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల శసహనాన్ని పరీక్షించొద్దని పేర్కొన్నారు. 8 గంటల పని దినం అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకూ అమలు చేయలేదని అన్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగుతుందని అన్నారు. 6వ తేదీన చలో హైదరాబాదు నిర్వహించి సచివాలయాన్ని జివికెని దిగ్భందనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె.నరసింహారావు, 108 యూనియన్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రవికుమార్, శ్రీను, లక్ష్మణ్, ఆంటోని, సుధాకర్, దయాకర్, కృష్ణ, వెంకట్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment