కాంట్రాక్టు లెక్చరర్ల దీక్షలు కొనసాగింపు
ప్రజాశక్తి - ఆదిలాబాద్‌టౌన్ Thu, 27 Jun 2013, IST
సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు లెక్చరర్లు కలెక్టరేట్ చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు రవీంద్రకుమార్ మాట్లాడారు. నాలుగు రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించడంలేదని అన్నారు. ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న తమను చిన్నచూపు చూస్తోందన్నారు. 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ రిలే దీక్షలను కొనసాగిస్తామని హెచ్చరించారు. దీక్షలో కోశాధికారి నవీన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవ్,తిరుపతిరెడ్డి, మహేందర్, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రజాశక్తి-యంత్రాంగం Sat, 29 Jun 2013, IST
ఉత్తరాంధ్రపట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ
కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన సమ్మె శనివారం నాటికి ఆరో రోజుకు చేరింది. దీక్షలకు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్సీ శర్మ మాట్లాడారు. తమ సర్వీసులు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతాయనే ఆశతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు. అతితక్కువ వేతనాలతో
పనిచేస్తున్న వీరందర్నీ రెగ్యులర్ చేయకుండా ఎపిపిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 4523 మంది జూనియర్ లెక్చరర్లు, 617 మంది డిగ్రీ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం జిఓ 132ను విడుదల చేయటం దుర్మార్గమని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ను అమలు చేయవద్దని శాసనమండలిలో తనతో పాటు పిడిఎఫ్ ఎమ్మెల్సీలంతా అడ్డుపడ్డామన్నారు. నోటిఫికేషన్‌ను అమలు చేయబోమని స్పష్టమైన హామీ ఇమ్మని అడిగినా, మంత్రి ఇవ్వలేదని తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాంట్రాక్టు లెక్చరర్ల భిక్షాటన
సమ్మెలో భాగంగా శనివారం కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్లు భిక్షాటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఎస్ఆర్ శర్మ, జిల్లా కార్యదర్శి జి.సత్యనారాయణ, మధుసూదనరావు, లలితారాణి, అప్పారావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment