విద్యార్థులకు 'ఆధార్' తిప్పలు
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ Fri, 7 Jun 2013, IST
- మండలాల్లో కేంద్రాల్లో ఏర్పాటు
స్కాలర్‌షిప్‌లు కావాలంటే ప్రతి విద్యార్థికీ ఆధార్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి ఇంటర్, డిగ్రీ, పీజి వంటి కోర్సుల్లో చేరే ప్రతి ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థికీ తప్పకుండా ఆధార్‌కార్డు ఉంటేనే స్కాలర్‌షిప్ రానుంది. జిల్లాలో కళాశాలల్లో చదుకుంటున్న ఎస్సీ రెన్యువల్ విద్యార్థులు 8,335మంది, బిసి విద్యార్థులు సుమారుగా 30వేల మంది, ఎస్టీ విద్యార్థులు ఐదువేల మంది ఉన్నారు. వీరిలో కేవలం ఇప్పటివరకు పది శాతానికి మించి ఎవరికీ అధార్‌కార్డులు లేవు. కొత్తగా ఈ విద్యా సంవత్సరం సుమారు 40వేల మంది విద్యార్థులు కళాశాలల్లో చేరనున్నారు. వీరందరికీ ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడంతో ఇంటర్నెట్ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.రాష్ట్రప్రభుత్వం కాలేజీల ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థికీ ఆధార్‌కార్డు తప్పనిసరని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఆధార్‌కార్డుల ప్రక్రియ సక్రమంగా జరగక పోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలోనూ ఆధార్‌కార్డుల పంపిణీ కేంద్రం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జననీ సురక్షయోజన పథకానికి ఆధార్‌ను అనుసంధానం చేయడంతో విద్యార్థులకు కార్డుల జారీకి సమయం పడుతుందని అధికారులు చెబు తున్నారు. కళాశాలలు ప్రారంభం నాటికి ఆధార్‌కార్డులు ఉండేలా చూడాలని సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఆయా శాఖల అధికారులు తాహశీల్ధార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే శాఖాధికారులు గ్రామ రెవెన్యూ అధికారులు ద్వారా విద్యార్థులకు నోటీసులు పంపించారు. అయితే కళాశాలల ప్రారంభం నాటికి ఆధార్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆధార్ గడువు పొడిగించాలని ఆయాశాఖల అధికారులు కోరుతున్నారు.
అన్ని మండలాల్లోనూ ఆధార్ కేంద్రాలు
డిఎస్‌డబ్ల్యూఓ జీవపుత్రకుమార్
జిల్లాలోని అన్ని మండలాల్లోనూ విద్యార్థుల కోసం ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిబిసిడబ్ల్యూఓ జీవపుత్రకుమార్ తెలిపారు. ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ చదువుతున్న విద్యార్థులంతా తప్పనిసరిగా ఆధార్‌కార్డులు పొందాలన్నారు. నోటీసులు పంపిన విద్యార్థులంతా ఆధార్ నమోదు చేసుకోవాలని చెప్పారు.
No comments:
Post a Comment