03-12-2017: సద్ది రొట్టె(నిన్నలేదా మొన్నటిది) తినేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. అయితే దానిలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పాలతో పాటు సద్ది రొట్టెను తీసుకోవడం వలన మధుమేహం అదుపులో ఉంటుందని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. దీనికితోడు రోజూ ఈ విధంగా సద్దిరొట్టెను తీసుకోవడం వలన బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. రొట్టె తయారుచేసిన ఒకటి, రెండు రోజుల తర్వాత దానిలో ప్రయోజనం చేకూర్చే బ్యాక్టీరియా చేరుతుంది. దీనితోపాటు దానిలోని గ్లూకోజ్ శాతం తగ్గుతుంది. ఇటువంటి రొట్టెను పాలతో తీసుకోవడం వలన ఉదర సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం లాంటి సమస్యలు సమసిపోతాయి. అలాగే ఇటువంటి రొట్టెలో ఫైబర్ ఉన్న కారణంగా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. దీనికితోడు సద్ది రొట్టె శరీర ఉష్టోగ్రతను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇటువంటి రొట్టెను తీసుకోవడం వలన వడదెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. శరీర బరువును తగ్గించడంలో, శరీరానికి శక్తిని సమకూర్చడంలోనూ సద్ది రొట్టి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో సద్దిరొట్టెను తీసుకోవడం వలన అధిక ప్రయోజనాలుంటాయి.
No comments:
Post a Comment