MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, January 28, 2016

ANDHRA JYOTH MAIN PAPER సెల్‌ఫోన్‌లో స్మార్ట్‌ కేర్‌

 హార్ట్‌రేట్‌, గ్లూకోజ్‌ లెవెల్స్‌, ఆక్సిజన్‌ లెవెల్స్‌, ఈసీజీ రీడింగ్‌... ఈ పరీక్షలు చేయించాలంటే పథాలజీ సెంటర్‌కు వెళ్లాల్సిందే. అయితే హెల్త్‌కేర్‌ గాడ్జెట్స్‌ ఉంటే అరక్షణంలోనే ఈ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని అరచేతి(స్మార్ట్‌ఫోన్‌)లోనే రిపోర్టులు చూసుకోవచ్చు. మెరుగైన జీవనం కోసం ఉపకరిస్తున్న ఆ గాడ్జెట్స్‌ విశేషాలు ఇవి...


వైద్యరంగంలోవస్తున్న మార్పులతో పాటు టెక్నాలజీ మెరుగైన జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఫిట్‌నె్‌సను మానిటర్‌ చేయడానికి స్మార్ట్‌వేర్స్‌, ఆరోగ్యసమస్యలను పర్యవేక్షించడానికి హెల్త్‌ యాప్స్‌ ఉపయోగపడుతున్నాయి. ఆస్తమా, గుండె జబ్బులు, డయాబెటిస్‌, ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిపోవడం వంటి సమస్యలను గుర్తించడం, మానిటర్‌ చేయడం వంటి పనులన్నీ గాడ్జెట్స్‌తోనే చక్కబెట్టుకోవచ్చు. ఈ గాడ్జెట్స్‌ చిన్నగా, జేబులో ఇమిడిపోయేంత సైజులో ఉంటాయి. వీటిని ఎక్కడికైనా వెంట తీసుకెళ్లవచ్చు.

టింకె
హార్ట్‌ రేట్‌, శ్వాసకోశాల స్థితి, రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌, గుండె పనితీరులో తేడాలను గుర్తించడానికి ఈ హెల్త్‌ మానిటర్‌ బాగా ఉపకరిస్తుంది. అదే సమయంలో ఇది ఫిట్‌నెస్‌ లెవెల్‌ను మానిటర్‌ చేస్తుంది. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, ఎలా రిలాక్స్‌ కావాలో టీచ్‌ చేస్తుంది. ఐఓఎస్‌ డివైజ్‌ల కోసం దీన్ని రూపొందించారు. డివైజ్‌కు అనుసంధానం చేసుకోవడం ద్వారా యాప్‌ని లాంచ్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

డారియో
డయాబెటిస్‌ ఉన్న వారు క్రమంతప్పకుండా గ్లూకోజ్‌ లెవెల్స్‌ చెక్‌ చేసుకోవాలి. వారి కోసమే ఈ పోర్టబుల్‌ గ్లూకోజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌. ఈ గాడ్జెట్‌లో గ్లూకోమీటర్‌ ఉంటుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌ ఆడియోపోర్టుకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. డారియోని ఉపయోగించడానికి ఒక బ్లడ్‌టెస్ట్‌ సి్ట్రప్‌ తీసుకుని మీటర్‌లో ఇన్‌సెర్ట్‌ చేసి స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేయాలి. దీంతో స్మార్ట్‌ ఫోన్‌లోని యాప్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను చెప్పేస్తుంది. యాప్‌లో మీరు ఎంటర్‌ చేసి ఫుడ్‌ ఇన్‌ఫర్మేషన్‌ను బట్టి ఎంత ఇన్సులిన్‌ అవసరమో తెలియజేస్తుంది.

స్కాన్‌డు స్కౌట్‌
హెల్త్‌ ట్రాకింగ్‌ గాడ్జెట్లలో ఇది అత్యుత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. హార్ట్‌ రేట్‌, చర్మం, శరీర ఉష్ణోగ్రత, శ్వాసకోశాల పనితీరు, రక్తపోటు, ఎలకో్ట్రకార్డియోగ్రఫీ, ఆక్సిజన్‌ లెవెల్స్‌, ఎమోషనల్‌ స్ట్రెస్‌ వంటి వివరాలన్నింటిని ఇది మానిటర్‌ చేసి తెలియజేస్తుంది. ఆరోగ్యం గురించి ఆందోళన ఉండకూడదంటే ఈ గాడ్జెట్‌ని చెంత ఉంచుకోవాల్సిందే.

బయోమెమె 
ప్రతిసారి రక్తపరీక్షలు చేయించుకోవడానికి ల్యాబ్‌కు పరుగెత్తాల్సిన అవసరం లేదు. బయోమెమె గాడ్జెట్‌ను ఐఫోన్‌కు కనెక్ట్‌ చేస్తే మొబైల్‌ డిఎన్‌ఎ ల్యాబ్‌గా మారిపోతుంది. రియల్‌టైమ్‌ క్యూపీసీఆర్‌ (క్వాంటిటేటివ్‌ పాలిమరైజ్‌ చెయిన్‌ రియాక్షన్‌)థర్మోసైక్లర్‌తో వ్యాధులను గుర్తించవచ్చు. రికార్డ్‌ అయిన డాటా మొత్తం యాప్‌లో స్టోర్‌ అవుతుంది. దీన్ని కావలసినపుడు తిరిగి పొందవచ్చు. ఆండ్రాయిడ్‌ కంపాటబుల్‌ వెర్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌సోనె
ఆస్తమా రోగులు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. చల్లటి వాతావరణంలో వారి అవస్థలు రెట్టింపవుతాయి. ఎప్పటికప్పుడు లక్షణాలను గుర్తిస్తూ జాగ్రత్తలు తీసుకుంటేనే సమస్య తీవ్రం కాకుండా ఉంటుంది. ఇందుకోసం ఎయిర్‌సోనె పోర్టబుల్‌ వీజ్‌ మానిటర్‌ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్‌ లక్షణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ గాడ్జెట్‌ను మెడ దగ్గర పెట్టుకుంటే చాలు. గురక, లంగ్స్‌లో నుంచి వచ్చే శబ్దాల నుంచి డాటాను సేకరించి ఫోన్‌కు పంపిస్తుంది. ఫోన్‌లో బ్రీతింగ్‌ ప్యాటర్న్‌ రికార్డు అవుతాయి. తరువాత డాటాను విశ్లేషించి సమాచారాన్నిస్తుంది. అంతేకాకుండా అప్‌డేట్స్‌ని డాక్టర్‌కి పంపించడంలోనూ యాప్‌ ఉపయోగపడుతుంది. మందులు వేసుకోవాల్సిన సమయాన్ని గుర్తు చేసి చెబుతుంది.

అల్కోహూట్‌
నైట్‌పార్టీలో కాస్త ఆల్కహాల్‌ తీసుకున్నారు. కార్‌ డ్రైవ్‌ చేస్తూ ఇంటికి రావాలంటే భయం. నిజానికి ఆల్కహాల్‌ ఎంత మోతాదులో తీసుకున్నారో తెలిస్తే ప్రయాణం వాయిదా వేసుకోవడమో, క్యాబ్‌ మాట్లాడుకుని వెళ్లడమో చేయవచ్చు. మరి ఆల్కహాల్‌ మోతాదు తెలుసుకునేదెలా అంటే? చాలా సింపుల్‌. అల్కోహూట్‌ గాడ్జెట్‌ ఉంటే చాలు. ఈ పోర్టబుల్‌ బ్రీతలైజర్‌లో బ్లడ్‌లో ఉన్న ఆల్కహాల్‌ లెవెల్స్‌ను తెలుసుకోవచ్చు. రిచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ గాడ్జెట్‌ యాప్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ యాప్‌లో దగ్గరగా ఉన్న రెస్టారెంట్ల వివరాలు లభిస్తాయి. సులభంగా ట్యాక్సీని బుక్‌ చేసుకునేందుకు కూడా వీలుంటుంది. లేట్‌ నైట్‌ పార్టీలో మోతాదు మించకూడదని అనుకుంటే ఈ బ్రీతలైజర్‌ ఉండాల్సిందే.

అలైవ్‌కర్‌
ఒకవేళ మీకు త్వరగా ఎలకో్ట్రకార్డియోగ్రామ్‌(ఈసీజీ) కావాలా? అయితే అలైవ్‌కర్‌ను ఎంచుకుంటే చాలు. స్మార్ట్‌ఫోన్‌ కేస్‌ మాదిరిగా ఉండే ఈ గాడ్జెట్‌లో కేస్‌ వెనకాల రెండు సెన్సర్‌ పాయింట్లు ఉంటాయి. వాటిపై చేతి వేళ్లను పెట్టినపుడు డివైజ్‌ ఈసీజీ రీడింగ్‌ను నమోదు చేస్తుంది. యాప్‌ సహాయంతో 30 సెకన్లలోనే ఈసీజీ రీడింగ్‌ వచ్చేస్తుంది. రీడింగ్స్‌ను యాప్‌లో ట్రాక్‌ చేయవచ్చు. డాక్టర్‌ సలహా కొరకు ప్రింట్‌ తీసుకోవచ్చు.

ఏంజిల్‌
గుండె పనితీరులో వచ్చే తేడాను గుర్తించి అలర్ట్‌ చేయడానికి ఈ గాడ్జెట్‌ ఉపయోగపడుతుంది. వర్కవుట్‌ ట్రాకర్‌గానూ, స్లీపర్‌ మానిటర్‌గానూ పనిచేస్తుంది. ఇందులో ఉండే టెంపరేచర్‌ సెన్సర్‌ సీ్త్రలలో అండాలు విడుదలయ్యే సమయాన్ని గుర్తిస్తుంది. దీనివల్ల గర్భధారణకు అవకాశాలను పెంచుకోవచ్చు. జ్వరంగా ఉంటే టెక్స్ట్‌ అలర్ట్‌ను పంపిస్తుంది. ఇందులో ఉండే సెన్సర్లు రక్తంలో ఉన్న ఆక్సిజన్‌ లెవెల్స్‌ను కూడా ట్రాక్‌ చేస్తాయి. యాప్‌తో పనిచేసే ఈ గాడ్జెట్‌ బ్లూటూత ద్వారా డాటాను పంపిస్తుంది.

ఎయిర్‌.ఎయిర్‌
గాలి కాలుష్యం బాగా పెరిగింది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కష్టతరమైపోయింది. అయితే గాలిలో కాలుష్యం స్థాయి అధికంగా ఉన్న చోట ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదు. మరి పొల్యూషన్‌ స్థాయి తెలుసుకునేదెలా అంటే? ఎయిర్‌.ఎయిర్‌ పోర్టబుల్‌ డివైజ్‌ గాలి నాణ్యతను లెక్కించి చెబుతుంది. గాలిలో ఉన్న పార్టికల్స్‌, సిగరెట్‌ స్మోక్‌, డిజిల్‌ వాహనాల నుంచి వెలువడిన పొగ తాలూకు విషవాయువులను ట్రేస్‌ చేస్తుంది. డివైజ్‌ నుంచి డాటా బ్లూటూత ద్వారా ఆండ్రాయిడ్‌ యాప్‌లోకి చేరుతుంది. యాప్‌లో అలర్ట్‌ సెట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ పొల్యూషన్‌ లెవెల్స్‌ నిర్ణయించిన లెవెల్స్‌ కన్నా తక్కువకు చేరితే అలర్ట్‌ వచ్చేలా పెట్టుకోవచ్చు. కాలుష్యం అధికంగా ఉండే ప్రదేశాలలో పనిచేసే వారికి ఉపయుక్తమైన గాడ్జెట్‌ ఇది.

ఎమోటివ్‌ ఇన్‌సైట్‌
తలకు పెట్టుకునే గాడ్జెట్‌ ఇది. ఇది మెదడులో నుంచి వేవ్స్‌ను మానిటర్‌ చేస్తుంది. ఎలకో్ట్రఎన్‌సెఫలోగ్రఫీ (ఈఈజీ)ని ట్రాన్స్‌లేట్‌ చేసి అర్థమయ్యే రీతిలో డాటాను అందిస్తుంది. దీనివల్ల అటెన్షన్‌, ఫోకస్‌, ఆసక్తి, రిలాక్సేషన్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవడానికి వీలవుతుంది. సె్ట్రస్‌ లెవెల్స్‌ను తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రీడింగ్స్‌ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లోకి చేరతాయి.
  • హార్ట్‌ రేట్‌, శ్వాసకోశాల స్థితి, రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌, గుండె పనితీరులో తేడాలను గుర్తించడానికి టింకె హెల్త్‌ మానిటర్‌ బాగా ఉపకరిస్తుంది. అదే సమయంలో ఫిట్‌నెస్‌ లెవెల్‌ను కూడా మానిటర్‌ చేస్తుంది.
  • ఏంజిల్‌లో ఉండే టెంపరేచర్‌ సెన్సర్‌ స్త్రీలలో అండాలు విడుదలయ్యే సమయాన్ని గుర్తిస్తుంది. దీనివల్ల గర్భధారణకు అవకాశాలను పెంచుకోవచ్చు.
  • అలైవ్‌కర్‌ గాడ్జెట్‌ ఉంటే 30 సెకన్లలో ఈసీజీ రీడింగ్‌ని స్మార్ట్‌ఫోన్‌లో చూడొచ్చు. గాడ్జెట్‌లో కేస్‌ వెనకాల ఉండే రెండు సెన్సర్‌ పాయింట్లు ఈసీజీ రీడింగ్‌ని నమోదు చేస్తాయి.

No comments: