MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, August 29, 2015

కార్మిక చట్టాలు అమలుచేయాలి

కార్మిక చట్టాలు అమలుచేయాలి
Posted On Wed 26 Aug 01:18:44.011966 2015
ఎటువంటి మినహాయింపులు లేకుండా చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి. ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి. స్వాతంత్య్రోద్యమం, కార్మికోద్యమం ఫలితంగా భారత రాజ్యాంగంలో కార్మికులకు కొన్ని రక్షణలు కల్పించారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్‌ 16లో సమానత ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఆర్టికల్‌ 19సి ప్రకారం సంఘం పెట్టుకునే హక్కు ఉన్నది. ఇవి గాక రాజ్యాంగం కొన్ని ఆదేశిక సూత్రాలు నిర్దేశించింది. ఇవి హక్కులుగా కాకపోయినా ప్రభుత్వం ఆ దిశలో నడవాలని ఈ సూత్రాల ఉద్దేశం. ఆర్టికల్‌ 38(1) లక్ష్యం సాంఘిక, ఆర్థిక, ఉపాధి హామీ పథకంతో పాక్షికంగానైనా ప్రారంభమైంది. 43ఎ లక్ష్యం కార్మికులకు మేనేజ్‌మెంట్‌లో భాగస్వామ్యం కల్పించటం. ఇదే విధంగా స్వాతంత్య్రోద్యమం కారణంగా, దానితోపాటు స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత జరిగిన కార్మికోద్యమం కారణంగా కార్మికవర్గం తన హక్కులు కాపాడుకునేందుకు అనేక చట్టాలు సాధించుకున్నది. కార్మికులకు రక్షణ కల్పించే ఈ చట్టాలు ట్రేడ్‌యూనియన్‌ చట్టం 1926, పారిశ్రామిక వివాదాల చట్టం 1947, ఇండిస్టియల్‌ ఎంప్లారుమెంట్‌ చట్టం, కంపెన్‌సేషన్‌ చట్టం 1946, ఫ్యాక్టరీ చట్టం 1948, అప్రెంటీస్‌ చట్టం 1961, వెట్టి శ్రమ చట్టం1936, కనీస వేతనాల చట్టం 1948, బోనస్‌ చెల్లింపుల చట్టం 1965, ఎంప్లాయీస్‌ కంపెన్సేషన్‌ చట్టం 1923, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972, ఇఎస్‌ఐ చట్టం 1948, ఇపిఎఫ్‌ అండ్‌ ఎంపి చట్టం 1952, మెటర్నిటీ బెనిఫిట్‌ చట్టం 1961, కాంట్రాక్టు లేబర్‌ చట్టం 1970, వెట్టి శ్రమ(నియంత్రణ, నిషేధం) చట్టం 1976, బాల కార్మికుల (నియంత్రణ, నిషేధం) చట్టం 1986, అసంఘటిత కార్మికుల సాంఘిక భద్రతా చట్టం 2008, మొదలైనవి. ఈ కార్మిక చట్టాలను యాజమాన్యాలు అమలు చేస్తున్నాయా, లేదా పర్యవేక్షించటం కార్మిక మంత్రి, కార్మిక శాఖ అధికారుల బాధ్యత. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత కార్మిక శాఖ కార్మిక హక్కుల అమలును పర్యవేక్షించే బాధ్యతను క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నది. కార్మిక శాఖ అధికారులు ఫ్యాక్టరీలను ఇన్‌స్పెక్షన్‌ చేయటం తగ్గించారు. ఇన్‌స్పెక్షన్‌ రేటు 1991లో 75.64 శాతం ఉండగా 2008 నాటికి 17.88 శాతానికి పడిపోయింది. కార్మిక శాఖకు తగినంత మంది సిబ్బంది లేనందున కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించటం తగ్గుతున్నదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక తెలియజేసింది. అయినప్పటికీ గత యుపిఎ ప్రభుత్వంగానీ, నేటి ఎన్‌డిఎ ప్రభుత్వంగానీ దీనిని పట్టించుకోవడం లేదు. దీని ఫలితంగా కార్మిక చట్టాల ఉల్లంఘన ఎక్కువైంది. ఇప్పటికీ 69 శాతం మంది సంఘటిత రంగ కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలు, ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు కావడం లేదు. కాంట్రాక్టు లేబర్‌ చట్టం ప్రకారం శాశ్వత స్వభావం గల పనికి కాంట్రాక్టు కార్మికులను కాక రెగ్యులర్‌ కార్మికులను నియమించాలి. కానీ ఈ చట్టాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రయివేటు రంగ కంపెనీలు అన్నీ ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వ రంగ కార్మికుల్లో 50 శాతం మంది, ప్రయివేటు రంగ కార్మికులలో 70 శాతం మంది కాంట్రాక్టు కార్మికులే. కనీస వేతనాలు, పని గంటలు, ఓవర్‌ టైం, పని ప్రదేశాల్లో భద్రత, తదితర చట్టాల ఉల్లంఘన బాహాటంగానే జరుగుతున్నది. అనేక పారిశ్రామిక, సర్వీసు యూనిట్లలో ఒటి లేకుండా 8 గంటలకు మించి రోజూ 10 లేదా 12 గంటలు పని చేయించటం పెరుగుతున్నది. అనేక పారిశ్రామిక యూనిట్లను యాజమాన్యాలు చట్టవిరుద్ధంగా మూసి వేస్తున్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చట్టాల ఉల్లంఘన రూపంలో జరుగుతున్న ఈ తీవ్రమైన దాడి కారణంగా తయారీ రంగంలో సృష్టించబడిన నికర విలువలో కార్మికుల వేతనాల వాటా 1981-82 నాటికి 30.28 శాతం కాగా 2010-11లో 21.16 శాతానికి పడిపోయింది. కాగా ఇదే కాలంలో యాజమాన్యాల లాభం వాటా 20 శాతం నుంచి 50 శాతం పెరిగింది. కానీ ఇదే కాలంలో కార్మికుల శ్రమ ఉత్పాదకత 5 రెట్లు పెరిగింది. పార్లమెంటు ఆమోదించిన కార్మిక చట్టాలను మేనేజ్‌మెంట్లు కచ్చితంగా అమలు చేయాలని, ప్రభుత్వం ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక వర్గం డిమాండ్‌ చేస్తున్నది. కార్మిక చట్టాల అమలుకు 2015 సెప్టెంబర్‌ 2 సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి.
పి అశోక్‌బాబు

No comments: