MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, March 1, 2014

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని... కృపారాణి కార్యాలయం ముట్టడి Posted on: Sat 01 Mar 00:56:45.51879 2014

- 179మంది అంగన్వాడీలు అరెస్టు, విడుదల   ప్రజాశక్తి - శ్రీకాకుళంరూరల్‌
అంగన్వాడీలకు కనీస వేతనం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర సౌకర్యాలు కల్పించాలని, సమ్మె నివారణకు జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు
కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటిశాఖ సహాయమంత్రి కిల్లికృపారాణి క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పంచాది పాపారావు మాట్లాడుతూ న్యాయమైన సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే, ప్రభుత్వం దొంగనాటకాలాడుతోందని దుయ్యబట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మె కొనసాగించాల్సి వస్తోందని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక మాదిరిగా అంగన్వాడీలకు కనీస వేతనం రూ.పది వేలు చెల్లించాలని, రిటైర్మెంట్‌ సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వాగ్ధానాలు చేస్తుందే తప్ప, సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. కేంద్రమంత్రి కృపారాణి కార్యాలయంలో లేకపోవడంతో సమస్యలు చెప్పేందుకు ఫోన్‌ చేసినా ఆమె అందుబాటులోకి రాలేదు. 
179మంది అరెస్టు
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కార్యాలయం ఎదుట బైఠాయించిన అంగన్వాడీలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పంచాది పాపారావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శి కె కళ్యాణి, డి గణేష్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పట్టణ కార్యదర్శి టి రాజేశ్వరితో సహా మొత్తం 179మందిని అరెస్టు చేసి మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ముట్టడిలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి ప్రమీల, ఆదిలకిë, పార్వతి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

No comments: