MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, March 16, 2014

ప్రతి పౌరుడూ వినియోగదారుడే

ప్రతి పౌరుడూ వినియోగదారుడే
వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమల దగా అని అప్పుడెప్పుడో మహా కవి శ్రీశ్రీ చెప్పారు. అప్పుడు కేవలం కొన్ని రంగాలలో మాత్రమే ఈ దగా, దోపిడీ ఉండేది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ దోపిడీ సర్వసాధారణమైంది. మొత్తం వ్యవస్థే కలుషితమైంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల కల్తీతోపాటు, విక్రయాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 'వినియోగదారుల పరిరక్షణ చట్టం గురించి ప్రజలు చాలా వరకు సద్వినియోగం చేసుకోనందున ఈ దుస్థితి దాపురించింది. నేడు మార్కెట్లో ఎక్కడ చూసినా బహుళజాతి కంపెనీల ద్వారా ఏర్పాటైన సూపర్‌ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. మామూలుగా మార్కెట్లో చిరు వ్యాపారులు అర లీటరు పాల ప్యాకెట్‌ను 20 రూపాయలకు విక్రయిస్తుంటే .. పైన తెలిపిన సూపర్‌ మార్కెట్లలో 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా అనేక రకాల నిత్యావసర సరుకుల రేట్లలో భారీ తేడా ఉంది. ఇక ఎలక్ట్రానిక్స్‌ దుకాణాల్లో కొంటున్న వస్తువులు వారం, పదిరోజులకే చెడిపోతున్నాయి.
రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార మేనిఫెస్టోల్లో అలవికాని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల అనంతరం వాటిని మరచిపోతున్నారు. కొన్ని పథకాలను వెనుకాముందూ ఆలోచించకుండా ప్రారంభిస్తున్నారు. ఆ తరువాత కొనసాగించలేక సతమతమవుతున్నారు. ఇందులో భాగమే గత పాలకులు తీసుకొచ్చిన ఉచిత కరెంట్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటివి. కరెంట్‌ ఉచితమే .. అయితే నిరంతర కోతల వల్ల పంటలు వేయడం రైతులు మానుకున్నారు. అందుకే రైతుల నుంచి ఆహార పదార్థాలు రాకపోవడం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. 'ఆరోగ్య శ్రీ' ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రులు కోట్లు దండుకుంటుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సారిడాన్‌, క్లోరోక్విన్‌, పారాసిటమాల్‌ వంటి మాత్రలు సైతం దొరకక జలుబు, జ్వరాలకు కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది. గత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. మరో మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి రూపాయికే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. నేడు బహిరంగ మార్కెట్లో 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కిలో బియ్యం ధర పలుకుతున్నది. కందిపప్పు, చక్కెర వంటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్‌, పెట్రోల్‌ వంటివాటి ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ప్రతి పల్లెలో, గల్లీలో యంసిఎ, యంబిఎ, బిటెక్‌ చదువుకున్నవాళ్లు కుప్పలుతెప్పలుగా కనబడుతున్నారు. ఉద్యోగాలు దొరక్క అలమటిస్తున్నారు. విద్యా సంస్థల అధినేతలు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరగడం వల్ల సమాజంలో అశాంతి, ఆర్థిక వ్యత్యాసం ఏర్పడి ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆందోళన మరోవైపు దారితీస్తూ అనేక రకాల సమస్యలను సృష్టించబోతున్నది. అందుకే ప్రశ్నించే వాళ్లు ముందుకు రావాలి. ఈ వినియోగదారుల చట్టాన్ని విస్తృత పరిధిలో గ్రామస్థాయి నుంచీ ప్రచారం చేసి సమాచార హక్కు చట్టాన్ని కూడా జోడించి ఎప్పటికప్పుడు ప్రజలను జాగృతపరుస్తూ బ్లాక్‌ మార్కెట్‌ మాఫియాను, రాజకీయ మాఫియాను నిర్మూలించాలి.

- తిప్పినేని రామదాసప్పనాయుడు, ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ మీడియా ఇన్‌ఛార్జి 
(నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం)

No comments: