MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, March 12, 2014

ACT NEWS: ఆర్టీసి సమ్మె విరమణ

కార్మిక కమిషనర్‌తో చర్చలు సఫలం  -ఇయు, టిఎంయు వెల్లడి
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 
ఈయూ, టిఎంయూ కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు పెంచిన 27 శాతం మధ్యంతర భృతిని ఏప్రిల్‌ 15 నాటికి చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకారం తెలిపింది. దీంతో బుధవారం ఉదయం నుంచి తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెను ఉపసంహ రించుకుంటున్నట్లు ఇయూ, టిఎంయూ ప్రకటించాయి. అంతకుముందు చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగింది. దానితో నేటి ఉదయం నుంచి సమ్మె చేస్తామని ఇయు, టిఎంయు ప్రధాన కార్యదర్శులు కె పద్మాకర్‌, ఇ అశ్వద్దామరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐఆర్‌ చెల్లించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రానందునే 27 శాతం ఐఆర్‌ చెల్లించలేక పోతున్నామని అధికారులు తెలియజేయడం సమంజసం కాదని తెలిపారు. జనవరి 26న కుదిరిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి నుంచి చెల్లించాల్సిన ఐఆర్‌ ఇవ్వకుండా ఆర్టీసి ఉద్యోగులపై సవతితల్లి ప్రేమను కనబరుస్తోందని పేర్కొన్నారు. అధికారుల ఈ వైఖరిని నిరసిస్తూనే బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటు న్నామని తెలిపారు. ఆర్టీసి ఉద్యోగులకు వెంటనే 27 శాతం ఐఆర్‌ చెల్లించాలని కోరారు. మంగళవారం ఇందిరాపార్క్‌ వద్ద ఇయు, టిఎంయు ఆధ్వర్యంలో రెండోరోజు నిర్వహిస్తున్న నిరాహారదీక్షా శిబిరాన్ని పద్మాకర్‌, అశ్వథ్థామరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇయు ఉప ప్రధాన కార్యదర్శి పి దామోదర్‌రావు, టిఎంయు నాయకులు యాదయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కోశాధికారి ఎవి రావు, ఎఐటియుసి నాయకులు విఎస్‌ బోస్‌, యూసుఫ్‌ పాల్గొన్నారు.


No comments: