MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, February 26, 2014

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండిPosted on: Wed 26 Feb 05:19:50.01052 2014


 -గవర్నర్‌కు యూనియన్‌ ప్రతినిధి బృందం వినతి   -నేడు కమిషనర్‌తో నేతల చర్చలు   ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 


      అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.10 వేలు చెల్లించాలని కోరారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, గ్రాట్యుటి, పెన్షన్‌ ఇవ్వాలని, సెంటర్‌ అద్దెల చెల్లించాలని, మినీ వర్కర్స్‌కు మెయిన్‌ వర్కర్స్‌తో సమానంగా వేతనాలు ఇవ్వాలని, అమృతహస్తం, బిఎల్‌ఓ డ్యూటీలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో వచ్చిన యూనియన్‌ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం జూలకంటి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారని తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారని అన్నారు. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే వేతనానికి అదనంగా రూ.2 వేల నుంచి 5 వేల వరకు చెల్లిస్తున్నారని వివరించారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నారని చెప్పారు. న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌గా జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని నరసింహన్‌ను కోరామన్నారు. అంగన్‌వాడీలకు న్యాయం కలిగే విధంగా అధికారులను ఆదేశించాలని సూచించామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని, పరిష్కారానికి తగు సూచనలు చేస్తానని గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రోజా మాట్లాడుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంగళవారం గవర్నర్‌తో చర్చలు జరిపామన్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహాని, కమిషనర్‌ చిరంజీవి చౌదరి సమక్షంలో చర్చలు జరుగుతాయని చెప్పారు. తమ సమస్యలపై ప్రభుత్వ ప్రతిపాదనలను బట్టి సమ్మె విరమణపై ఆలోచిస్తామని తెలిపారు. యూనియన్‌ రాష్ట్ర కమిటీలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. గవర్నర్‌తో జరిగిన చర్చలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి హాజరయ్యారు. గవర్నర్‌ను కలిసిన వారిలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయిబాబు, కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, జె వెంకటేష్‌, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌ భారతి, కార్యదర్శి పి జయలక్ష్మి తదితరులున్నారు. సమ్మెకాలాన్ని సర్వీస్‌ బ్రేక్‌గా పరిగణిస్తూ స్త్రీ, శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని సర్కులర్‌ జారీ చేయడాన్ని అంగన్‌వాడీల యూనియన్‌ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. సమస్యలను పరిష్కరించకుండా సమ్మె విచ్చిన్నానికి పాల్పడటం అప్రజాస్వామికమని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి రోజా విమర్శించారు. ఆ సర్కులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments: