MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, February 22, 2014

ఉధృతంగా అంగన్‌వాడీల ఆందోళనలు Posted on: Sat 22 Feb 04:05:18.678808 2014

- అనంతపురంలో అరెస్టులు  - కర్నూలు కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత  
ప్రజాశక్తి - యంత్రాంగం
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృత రూపం దాల్చాయి. పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు, వినూత్న నిరసనలతో కదం తొక్కారు. అన్ని జిల్లాల్లోనూ తహశీల్దారు కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు వీరికి సంఘీభావం తెలిపారు. 
అనంతపురంలో అంగన్‌వాడీ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం కలెక్టరేట్‌లో పోలీసులు అడ్డుకున్నా.. వారిని నెట్టుకుని అంగన్‌వాడీలు లోపలికెళ్లారు. కర్నూలులో అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌ కార్యాలయాలను ముట్టడించారు. జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది. అంగన్‌వాడీలు గేట్లు తెరుచుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కడపలో ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ వద్ద మండుటెండలో రోడ్డుపై మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద మానవహారం, కుప్పంలో ధర్నా చేపట్టారు. పుంగనూరులో సమ్మె ఐదో రోజూ కొనసాగింది.
శ్రీకాకుళంలో తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. విజయనగరం కలెక్టరేట్‌లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకోవడంతో ఆగ్రహించిన అంగన్‌వాడీలు గేట్లను, పోలీసులను తోసుకుంటూ వెళ్ళి గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. నెల్లిమర్లలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖలో ర్యాలీ, మానవహారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మునగపాకలో కళ్లకు గంతలు కట్టుకొని, నక్కపల్లిలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా, భిక్షాటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, కొవ్వూరు పెనుమంట్ర, ఉండిలో ధర్నా చేశారు. తాళ్లపూడి, నరసాపురంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. బుట్టాయగూడెం, ఆచంట, పాలకొల్లు రూరల్‌, చాగల్లులో ఆందోళన చేపట్టారు. విజయవాడ పైపులరోడ్డు జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేశారు. సబ్‌ కలెక్టరేట్‌ వద్ద వద్ద చెవిలో పుప్వు, చేతిలో చిప్పతో నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో మానవహారం, తెనాలి, రొంపిచర్లలో ర్యాలీలు, రేపల్లెలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేశారు. వినుకొండ, గుంటూరు, శావల్యాపురంలో మోకాళ్లపై నిలబడి, మంగళగిరిలో చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై కూర్చొని, వలేటివారిపాలెంలో చెవిలో పూలతో నిరసన తెలిపారు. 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చంటి పిల్లలను ఎత్తుకుని రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట, పాలకుర్తిలో మానవహారాలు నిర్వహించారు. జనగామ, పరకాలలో భిక్షాటన చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం, భువనగిరిలో ఆర్డీఓ కార్యాలయం, ఎదుట, హుజూర్‌నగర్‌లో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద, దేవరకొండలో ధర్నాలు చేశారు. మిర్యాలగూడలో భిక్షాటన చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం, తానూర్‌, కభీర్‌, కమ్మర్‌పల్లి, లింగంపేట్‌లో ధర్నా చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. వర్నిలో మౌన దీక్ష చేపట్టారు. ఎడపల్లి, రెంజల్‌లో మోకాళ్లపై నిరసన తెలిపారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఐసిడిఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సిరిసిల్లలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పలుచోట్ల ధర్నాలు కొనసాగాయి. షేక్‌పేట, ఖైరతాబాద్‌ మండల కార్యాలయాలను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లాలో సమ్మె ఉధృతంగా సాగింది. 
అంగన్‌వాడీల రాష్ట్ర విస్తృత సమావేశ నిర్ణయం శ్రీ 24న చలో హైదరాబాద్‌ 
డిమాండ్ల సాధనకోసం నిర్వహిస్తున్న సమ్మెను నిరవధికంగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర విస్తృత సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యన్‌.భారతి, పి.రోజా ఒక ప్రకటనలో తెలిపారు. పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు మరోసారి వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 24న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలిరావాలని అంగన్‌వాడీ ఉద్యోగులకు వారు పిలుపునిచ్చారు.

No comments: