MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, February 21, 2014

సమ్మె విజయవంతం

Posted on: Fri 21 Feb 04:24:22.47041 2014  SRIKAKULAM NEWS

- విధులు బహిష్కరించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు
- కలెక్టరేట్‌ వద్ద ధర్నా
ప్రజాశక్తి - అరసవల్లి
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కల్పించాలని, ఐఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రాష్ట్ర కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుమేరకు గురువారం చేపట్టిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాకు పెద్దఎత్తున కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొని తమ నిరసన తెలిపారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. 
ధర్నానుద్దేశించి ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.సురేష్‌బాబు మాట్లాడుతూ శాశ్వత స్వభావంగల పనుల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తూ 1970లో రూపొందించిన కార్మికచట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. రెగ్యులర్‌ పోస్టుల స్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమిస్తూ వారికి కనీసవేతనం చెల్లించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, యూనివర్శిటీలు, తదితర విభాగాల్లో ఆరు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా, జీతాల పెంపు, ఐఆర్‌ విషయంలో ప్రభుత్వం తీవ్ర వివక్షత చూపుతోందని విమర్శించారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు గత పిఆర్‌సి తరువాత 64శాతం డిఎ పెంచిన ప్రభుత్వం, వీరికి మాత్రం మొండిచేయి చూపిందని పేర్కొన్నారు. మహిళా కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 180రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలను పెంచాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని విమర్శించారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలనూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పోరాటాలకు సిఐటియు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సాయిప్రసాద్‌ మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో తీవ్ర శ్రమ దోపిడీ చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు ఎన్‌.వెంకటలక్ష్మి, ఎన్‌.సుజాత, బి.ఉషారాణి, బి.మురళి, శారద, పి.తవిటినాయుడు, టి.విజయమోహన్‌, జె.సింహాచలం, కమల, సరిత, ఎన్‌విఎల్‌.లక్ష్మి పాల్గొన్నారు. ధర్నాకు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.తిరుపతిరావు, కోశాధికారి ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య సంఘీభావం ప్రకటించారు.

No comments: