MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, February 11, 2014

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తీర్చాలి

Posted on: Mon 10 Feb 23:07:01.14209 2014

కార్మికులు సమ్మె చేపడితే ఎలా ఉంటుందో ఈ రెండు రోజుల్లోనే ప్రజలకు అర్థమై ఉంటుంది. అందులోనూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె అనగానే ముఖ్యంగా నగరవాసులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఎందుకంటే చెత్త
పూర్తి వివరాలు కోసం 

ఎక్కడికక్కడ పేరుకు పోవడంతో దోమలు, క్రిమి కీటకాలు చెత్తపై తాండ విస్తున్నాయి. దీంతో దోమలు విజృంభించి మలే రియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలే ప్రమాదముంది. ఇక రోడ్ల సంగతి సరేసరి. మామూలుగానే హైదరాబాద్‌లో రోడ్లు అంతంతమాత్రంగా ఉంటాయి. ఇక వాటిపై చెత్త తాండవిస్తుండడంతో వాహనాలు నడపడం చాలా ఇబ్బందిగా మారింది. పైపెచ్చు ట్రాఫిక్‌ సమస్య! అలాగే వాతావరణం కూడా కలుషితమైపోతుంది. ఏది ఎలా ఉన్నా పారిశుద్ధ్య కార్మికులు చేసే సమ్మె ప్రభావం అందరిమీదా పడుతుంది. అందుకే ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను అంగీక రించి వారికి న్యాయం చేయాలి. తగువిధంగా చర్యలు తీసుకుని వాటిని వెంటనే అమలే చేయాలి. ఇదివరకు కూడా అలానే జరిగింది కాబట్టి కార్మికులు ఈసారి ఇంత ఉధృతంగా సమ్మెబాట పట్టారు. అలా కాకుండా కార్మికులకు అన్యాయం చేస్తే మాత్రం రాష్ట్ర వాతావరణం పూర్తిగా కలుషితమయ్యే ప్రమా దం ఉంది. అందుకే పాలకులు త్వరితంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.

- నాగమణి, హైదరాబాద్‌

No comments: