MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, January 30, 2014

అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం

Posted on: Tue 28 Jan 05:50:49.942805 2014
- నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు - అక్రమ అరెస్టులు - కరీంనగర్‌లో పిడిగుద్దులు - వరంగల్‌లో కలెక్టర్‌ బెదిరింపులు ప్రజాశక్తి-యంత్రాంగం 
బాలబడుల్ని అంగన్‌వాడీలకే అప్పగించాలనీ 
ఇందిరమ్మ అమృత హస్తం పెండింగ్‌ బిల్లుల్ని, పెంచిన అద్దె బిల్లులు చెల్లించాలనీ, వేతన జీవో అమలు చేయాలనీ అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చలో కలెక్టరేట్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. అంగన్‌వాడీ పోస్టుల్ని భర్తీ చేయాలి, అధికారుల వేధింపుల్ని ఆపాలంటూ డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల నినాదాలతో కలెక్టరేట్‌లు మారుమోగాయి. ఆందోళనకారులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుని అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. కరీంనగర్‌ జిల్లాలో ఆందోళనకారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దొరికిన వారిని దొరికినట్లు పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. వరంగల్‌లో కలెక్టర్‌ అంగన్‌వాడీలపట్ల అసభ్యంగా మాట్లాడారు. కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట సుమారు 4 గంటలపాటు ఆందోళన చేసినా అధికారులు స్పందించకపోవడంతో కార్యకర్తలు గేట్లను తోసుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి వెళ్లే దారులను దిగ్భందించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. అధికారులతో డిఎప్‌పి రవీందర్‌ ఫోన్‌లో పరిస్థితి వివరించారు. కార్యకర్తలు కలెక్టరేట్‌ లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనాకారుల మధ్య తోపులాట జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌ సంపత్‌పై పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. ఆయనను మెడపట్టి లాక్కెళ్లి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఐసిడిఎస్‌ అధికారులు, యూనియన్‌ ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఆదిలాబాద్‌లో కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. నిజామాబాద్‌లో భారీ ర్యాలీ, అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట కూడా ధర్నా నిర్వహించారు.వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా, అనంతరం గ్రీవెన్స్‌సెల్‌లో ఉన్న కలెక్టర్‌ కిషన్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వబోగా ''మీకు అనుమతి ఎవరిచ్చారు... షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తాం. కేసులు పెడతాం. మీ పనులు నాకు తెలుసు. ఇప్పుడు శరం వచ్చిందా' 
అంటూ అసభ్యంగా మాట్లాడారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మంగళవారం వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఆందోళనకు సంఘం పిలుపునిచ్చింది. ఖమ్మం నగలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్‌ చేపట్టి, కలెక్టర్‌ శ్రీనరేష్‌కు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు దిగ్బంధించారు. మహేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలు కలెక్టరేట్‌కు వస్తుండగా.. చాంద్రాయణగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ సిఐటియు కార్యకర్తలు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. అరగంట పాటు అక్కడే రాస్తారోకో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన అంగన్‌వాడీలను అరెస్టు చేశారు. కలెక్టరేట్‌ వెనుక గేటు వద్ద బైఠాయించిన వారినీ అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంగన్‌వాడీల జిల్లా సహాయ కార్యదర్శి కె.నిర్మల, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.నర్సింహ, ప్రధాన కార్యదర్శి సి.వెంకటేష్‌ను లాక్కెళ్లి డిసిఎంలోకి నెట్టివేశారు. మహిళలనూ ఈడ్చుకెళ్ళారు. కొందరికి గాయాలయ్యాయి. అరెస్టును నిరసిస్తూ స్టేషన్లో సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. మహబూబ్‌నగలర్‌ డిఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు.అనంతపురం, కర్నూలు కలెక్టరేట్ల వద్ద, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలున్నచోట బాలబడులు, మరే ఇతర పోటీ సెంటర్లకు అనుమతులు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్దయ బైఠాయించారు. ఐసిడిఎస్‌ పీడీ టివి శ్రీనివాస్‌ ధర్నా వద్దకు వచ్చి సమస్యలనడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్‌ ఎం.రఘునందనరావుకు వినతిపత్రం అందజేశారు.

No comments: