MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, January 16, 2014

ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి


Posted on: Thu 16 Jan 00:52:39.270521 2014
మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులకే దక్కుతుంది. సమాజంలో గురువులది ప్రత్యేక స్థానం. పిల్లల్ని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ముఖ్యపాత్ర వహిస్తారు. కేవలం జ్ఞానాన్ని అందించడమే కాదు.. దేశ పౌరులుగా తీర్చిదిద్ద డంలోనూ ప్రథమ స్థానం వారికే దక్కుతుంది. మరి ఇలాంటి గురువులే పిల్లల పట్ల అంత కర్కశంగా ఎలా ప్రవర్తిస్తున్నారు? ప్రయివేటు స్కూలు యాజ మాన్యాల కఠిన వైఖరి వల్ల పిల్లలు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. యాజ మాన్యాల దారుణమైన నిర్ణయాల వల్లే ఈ అనర్ధాలని చెప్పుకోవచ్చు. నేడు విద్య కూడా కార్పొరేట్‌ అయి పోయింది. చదువు కునేందుకు కాకుండా చదువుకొనేలా మారి పోయింది. ప్రయివేటు స్కూళ్లలో అవసరం ఉన్నా లేకపోయినా నోట్‌బుక్స్‌ వాడుతున్నారు. పలకలు ఎప్పుడో బూజుపట్టిపోయాయి. ఆ పుస్తకాలు మోయలేకే పిల్లల వెన్నుపూసలు కరిగి పోతున్నాయి. ఈ ఆర్భాటాలన్నీ చూసి పిల్లల తల్లిదండ్రులు ఇలా ఉంటే బాగా చదువొస్తుంది. చదువు బాగా చెబుతారు అనే భ్రమలో పడుతున్నారు. పొద్దస్తమానం చదువు కోసం కూర్చోవడం వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. ఆడుకునే వయసులో మెదడుకు విపరీతంగా పని చెబుతున్నారు. వారు చదివే చదువుకు మెదడును అంతగా ఇబ్బంది పెట్టనవసరం లేదని నిపుణులు సైతం చెబుతున్నారు. అయినా వారి మాటలను బేఖాతరు చేస్తూ ప్రయివేటు స్కూళ్ల యాజ మాన్యం చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. ఈ పరిణామాల వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాగానీ ఏమాత్రం చలించడం లేదు. కేవలం డబ్బు మోజులో పడి మానవీయ విలువల్ని తుంగలో తొక్కుతున్నారు. మొన్నీమధ్యకాలంలోనే స్కూలు ఫీజు కట్టలేదని అమ్మాయిని ఎండలో నిలబెట్టడం వల్ల స్పృహతప్పి పడిపోయి మృతి చెందింది. స్కూలు యాజమాన్యం ఎంత దారుణంగా ప్రవర్తించిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక్క ఫీజు కట్టలేదనే కాదు.. భాషాపరంగా కూడా పిల్లల్ని చిత్రవధ చేస్తున్నారు. కేవలం ఆంగ్ల భాషలోనే మాట్లాడాలనే నిబంధనతో పిల్లల్ని చావబాదిన ఘటనలెన్నో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోని ఉపాధ్యాయులు పేద పిల్లలకు ఫీజులు కట్టడం, పుస్తకాలుకొనివ్వడం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికి విద్య పట్ల అంత మమకారం ఉంటుంది. కానీ ప్రయివేటు స్కూళ్లలో మాత్రం పిల్లలకు ఫీజులు కట్టడం లేదు సరికదా కొంచెం లేటయినందుకు చాలా కఠినంగా ప్రవర్తించి వారి ప్రాణాలు పోయేలా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఇది కేవలం ఓ ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘట నలు జరుగుతున్నా పాల కులు కూడా అటువంటి యాజ మాన్యాలపై చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. 
ప్రభుత్వ స్కూళ్లలో చదువు సరిగ్గా చెప్పరు, ఉపాధ్యాయులు సరిగ్గా ఉండరు, మౌలిక వసతులు సరిగ్గా ఉండ వనే కారణంతో తల్లి దండ్రులు తమ పిల్లల్ని ప్రయివేటు స్కూళ్లకు పంపడం అలవాటు చేసుకుంటున్నారు. సర్కారు బడి చెత్తబడి అనే భ్రమలోకి వెళుతున్నారు. కానీ తల్లిదండ్రులు గమనంలో ఉంచుకోవాల్సింది అది ప్రభుత్వ పాఠశాల.. అంటే పిల్లలకోసం ప్రభు త్వమే ఏర్పాటు చేసిన పాఠశాల. ఉపాధ్యాయులు సైతం ఎంతో నైపుణ్యం ఉన్నవారు. ప్రయివేటు స్కూళ్లమాదిరి ఆషామాషీ ఉపాధ్యాయులు కాదు. మానవీయ విలువలకు ప్రత్యక్ష రూపం. ఫీజులు చెల్లిస్తేనే చదువు బాగా చెబుతారు. ఏదో తమ పిల్లలు ఉన్నతస్థాయిలో బ్రతుకుతారు అను కోవడం పొరపాటు. ప్రయివేటు స్కూళ్ల పిల్లల మార్కుల శాతం కన్నా ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లల మార్కుల శాతం మెరుగ్గా ఉంటోంది. దానికి కారణం ఒత్తిడి విద్య కాదు.. మెరుగైన విద్యవారికి అందుతోంది. అలాంటి విద్య అందితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇవన్నీ తల్లిదండ్రులు గమనంలో ఉంచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కోసం కోసం కృషి చేసి సాధించుకోవాలి తప్ప ప్రత్యామ్నాయంగా ప్రయివేటు స్కూళ్లవైపు మొగ్గుచూపడం సరికాదు. 
- లక్ష్మీ భవాని, గుంటూరు

No comments: