MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Monday, October 21, 2013

కాంట్రాక్టు కంప్యూటర్‌ ఉద్యోగుల కొనసాగింపు andhraprabha Mon, 21 Oct 2013, IST

కాంట్రాక్టు కంప్యూటర్‌ ఉద్యోగుల కొనసాగింపు
andhraprabha apr - Mon, 21 Oct 2013, IST 

హైదరాబాద్‌, ఆంధ్రపభ ప్రతినిధి: విద్యాశాఖలో దశాబ్ధకాలం నుండి కొనసాగుతున్న కాంట్రాక్టు కంప్యూటర్‌ టీచర్లను ఈ ఏడాది కూడా కొనసాగించడానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అం గీకరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో దేశమంతటా అన్ని ఉన్నత పాఠశాలల్లో 2002 సంవత్సరం నుండి కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో 12,800 మంది కంప్యూటర్‌ ఉపాధ్యా యులు ఏడు ఏజన్సీల ద్వారా కాంట్రాక్టు పద్దతిసై నియమించారు. ఆయా కాంట్రాక్టు సంస్థలు వీరి నుండి ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల వరకూ వసూలు చేసి ఉద్యోగాలు కల్పించింది. నెలకు రూ.2,315 వేత నంతో వీరు చాలా చాలని జీతాలతో ఆయా పాఠ శాలలో పని చేస్తు న్నారు. 6వ తరగతి నుండి విదార్థినీ విద్యా ర్ధులకు కంప్యూటర్‌ పట్ల అవ గాహన కలిగిం చడానికి వీరిని నియ మించారు. 11 సం వత్సరాల పాటు వీరంతా ఉద్యోగాలు చేసారు. ప్రతీ జిల్లాలో 500 మందికి పైగా కంప్యూ టర్‌ ఉపాధ్యా యులు కాం ట్రాక్టు ఉద్యో గులుగా పని చేస్తున్నారు. ఏ రోజైనా తాము శాశ్వత ప్రాతిపదికన భర్తీ అవుతామనే ధీమాతో వీరంతా కొనసాగారు. వీరికి నెలవారీ జీతాలు గత నెల నుండి ఆగిపోయాయి. ప్రభుత్వం వీరికి ఉదాసన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయస్సును కోల్పోవడంతో వీరు రెండికీ చెడిన రేవడి అయ్యారు.
వాస్తవానికి వీంతా సెప్టెంబరు నెల నుండి విధులలోకి రావద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసారు. దీంతో వీరంతా ఉద్యోగాలు కోలోయి నిరుద్యోగులుగా మారిపోయారు. ఐఎన్‌టియుసి జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేంద్ర వీరి సాధక బాధలను తమ జాతీయ అధ్యక్షుడు, పశ్చిమ ఢిల్లీ ఎంపి మహాబలేశ్వర్‌ మిశ్రా కు వివరించారు. దేశ వ్యాప్తంగా ఈ పధకం ఇంకా అమలులో ఉందని, కేంద్ర ప్రభుత్వం వీటికి నిధులు అందించాలని ఐఎన్‌టియసి జాతీయ అధ్యక్షులు, పశ్చిమ ఢిల్లీ ఎంపి మహాబలేశ్వర మిశ్రా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసారు. కంప్యూటర్‌ విద్యను ఏడో పాఠ్యాంశంగా పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. ఇప్పటికే పంజాబ్‌, కేరళ, కర్నాటక, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలు తమ తమ పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్‌ విద్యను చేర్చాయని వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో 12,800 మంది నిరుదోగులుగా మారిపోతున్నారని, వీరికి ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద్‌లకు కూడా ఈ మేరకు లేఖలు రాసారు. గ్రాడ్యుయేట్లు, బిఎడ్‌లు, కంప్యూటర్‌లో డిప్లమో చేసిన వారు టీచర్లుగా పని చేస్తున్నారని వివరించారు. ఐఎన్‌టియుసి నేతల వత్తిడితో కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ఎం.ఎం పళ్లంరాజు ఇటీవల ముఖ్య మంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. కేంద్రం తన వంతు వాటా అందచేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా అందచేయడానికి సిద్ధంగా ఉందని తెలపడంతో ఈ ఏడాది ఈ పథకాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసు కున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఐఎన్‌టి యుసి జాతీయ ఉపాధ్యక్షుడు మిద్దెల జితేంద్ర తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. కంప్యూటర్‌ విద్యను ఏడో సబ్జక్టుగా చేర్చాలని ఆయన కోరారు. తమ సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకున్న ఐఎన్‌టియుసి జాతీయ ఉపాధ్యక్షులు మిద్దెల జితేంద్రకు ఆంధ్ర ప్రదేశ్‌ కంప్యూటర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (యాక్ట్‌ ) అధ్యక్షుడు పణీశ్వరరావు తమ ధన్యవాదాలు తెలిపారు.

8 comments:

sunil dasari said...

thanks to INTUC Jitendhar Sir And Paneshwar sir and also
thanks to act srikakulam

sunil dasari said...

thanks to INTUC Jitendhar Sir And Paneshwar sir and also
thanks to act srikakulam

Adilabad said...

thanks to INTUC Jitendhar Sir Paneshwar sir and also thanks to act srikakulam all teem members and computer facultys

Adilabad said...

thanks to INTUC Jitendhar Sir Paneshwar sir and also thanks to act srikakulam all teem members and computer facultys

Jumidi Raju said...

THANKS TO INTUC JITENDHAR SIR & PANESHWAR SIR AND ALSO,THANKS TO SRIKALULAM ACT

Jumidi Raju said...

Many Many Thanks to INTUC Jitendhar Sir Paneshwar Sir and also, Thanks to Act Srikakulam Members

Anonymous said...

thanks to INTUC Jitendhar sir , paneshwar sir and act members we are allways with you sir

anil babu said...


thanks to INTUC Jitendhar sir , paneshwar sir and act members we are allways with you sir