MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, August 28, 2015

10 పాఠాలు తొల‌గింపులో.. గంద‌ర‌గోళం

10 పాఠాలు తొల‌గింపులో.. గంద‌ర‌గోళం

Posted On Thu 27 Aug 01:04:21.386072 2015
- ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత
ప్రజాశక్తి-టెక్కలి
ప్రస్తుతం పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో కొన్ని పాఠ్యాంశాలను తొలగిస్తూ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం గందరగోళంలోకి నెట్టింది. విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలలు ముగుస్తున్న తరుణంలో పాఠ్యాంశాలు తొలగించేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం, వాటిని విద్యా సంవత్సరం మధ్యలో ప్రవేశపెట్టడం చూస్తుంటే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి, విద్యాశాఖ యంత్రాంగానికి అవగాహన లేదని పలువురు భావిస్తున్నారు.
విద్యార్థులకు పాఠాల బరువులు తగ్గించాలని భావించిన విద్యాశాఖ 10వ తరగతిలో ఏడు సబ్జెక్టుల్లోనూ కొన్ని పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పాఠాలను ఎందుకు తొలగిస్తున్నారో వివరణ ఇవ్వలేకపోతోంది. పాఠ్యాంశాలు తయారు చేసినప్పుడు, వాటిని ముద్రించే ముందు ఆలోచన చేయలేని విద్యాశాఖ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఈ పాఠ్య పుస్తకాలను గతేడాది ప్రవేశపెట్టగా, ఈ ఏడాది పాఠ్యాంశాలు తొలగిస్తున్నామని విద్యాశాఖ చెబుతోంది. అది కూడా విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలలు ముగిసి, త్రైమాసిక పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ఆక్షేపణ వెలిబుచ్చుతున్నారు. ఈ నిర్ణయంతో కార్పొరేట్‌ విద్యాసంస్థలకు బలం చేకూరుతుంది. ఇప్పటివరకు ఉన్నతస్థాయి పదవులను చేపట్టిన ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే. ప్రతిభా పరీక్షల్లోనూ విజయం సాధించినవారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసినవారే. 
ఇందుకనుగుణంగా మేధావులు, విద్యావేత్తలు పాఠ్యాంశాలు రూపొందించారు. ఇప్పుడు అటువంటి పటిష్టమైన పాఠ్యాంశాలను తొలగిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల జ్ఞానం నిర్వీర్యమవుతుంది. ఇప్పటికే కార్పొరేట్‌ స్కూల్లో టెక్నో పాఠాలు బోధన జరుగుతోంది. అంటే కార్పొరేట్‌ స్కూల్లో ఒకవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిలబస్‌ను బోధిస్తూనే మరోవైపు టెక్నో పేరుతో అదనపు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈ విద్యార్థులకు లేని చదువుల భారం ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై ఎందుకు పడుతుందనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. మరోవైపు ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్లో విద్యార్థులపై చదువుల భారం పెరుగుతుంది. నర్సరీ పేరిట విద్యార్థిపై బలవంతపు విద్యను నూరి పోస్తున్నారు. 1, 2 తరగతులు చదివే పిల్లలకు కంప్యూటర్‌, జి.కె, కరెంట్‌ అఫైర్స్‌ పేర్లతో పీరియడ్లు కేటాయించి విద్యాబోధన చేస్తున్నారు. ఇక్కడ లేని చదువుల భారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ఎందుకనేది ప్రశ్న.
ఇప్పటికే మారిన పుస్తకాలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి జ్ఞానాన్ని నిర్వీర్యం చేసే పాఠ్యాంశాలతో పుస్తకాలు రూపొందాయి. ఈ పాఠాలు ఎలా ఉన్నాయంటే ప్రస్తుత విద్యార్థికి భవిష్యత్‌లో ప్రభుత్వం ఉద్యోగం కల్పించకపోతే ఉపాధి పొందడానికి వీలుగా పాఠ్యాంశాలను తయారుచ ేసింది. ఇందుకు ఉదాహరణే 6వ తరగతి సైన్స్‌ పుస్తకంలో ఉప్మా, పులావ్‌, హల్వా తయారీ వంటి వంటకాలతో పాఠ్యాంశాలున్నాయి. అంటే ఒక రకంగా ప్రభుత్వం ఉద్దేశం 'భవిష్యత్‌లో ఉద్యోగాలు కల్పించలేం, ఉపాధి పొందండి' అని సూత్రప్రాయంగా చెబుతోంది. ఇటువంటి పాఠ్యాంశాలతో ఇప్పటికే విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం తాజాగా మరిన్ని పాఠాలు తొలగిస్తున్నట్లు ప్రకటించడం విస్మయానికి గురిచేస్తుంది. విద్యా శాఖా మంత్రిగా గంటా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ ఆలోచనలు విద్యారంగంపై పడడం పలు సందేహాలకు తావిస్తోంది. పదిలో తొలగించామని చెబుతున్న పాఠాలు ఇప్పటికే తరగతి గదిలో బోధన పూర్తయ్యాయి. ప్రస్తుత తరుణంలో పాఠ్యాంశాలు తొలగింపుతో గందరగోళం ఏర్పడుతోంది. ఏదేమైనా రోజుకొక ఉత్తర్వులతో విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ ఆందోళనకు దారి తీస్తున్నాయి.

No comments: