హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించడంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను యఽథావిధిగా క్రమబద్ధీకరించడం కుదరదన్నారు. ఖాళీల భర్తీలో విద్యార్హతలు, వయసు తదితర విష యాలను పరిగణనలోకి తీసుకుని వెయిటేజ్ ఇస్తామని తెలిపారు. సోమవారం శాసన మండలిలో ఆదిరెడ్డి అప్పారావు, రుద్రరాజు పద్మరాజు, నాగేశ్వరరావు, రామచంద్రయ్య, పీజె.చంద్రశేఖర్, సుధాకర్‌బాబు, శివకుమారి, పుల్లయ్య తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెబు తూ.. 13,671 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని తెలి పారు. అయితే ఇంకా కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారనిచెప్పారు. దీనిపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు.
No comments:
Post a Comment