MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, June 28, 2014

TELAGANA NEWS: తేలని 'కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌' లెక్కలు

Posted on: Sat 28 Jun 05:59:26.306196 2014

- వివరాలకోసం ఆర్థికశాఖ కసరత్తు  - సమగ్ర సమాచారానికి రెండు నెలలు  - ఆ తర్వాతే క్రమబద్ధీకరణ - రెండు రోజుల్లో కొనసాగింపు ఉత్తర్వులు 

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 
                          తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఖ్య ఎంతనేది ఇంతవరకూ ఇతమిద్దంగా తేలకపోవటంతో ఇటు ఉద్యోగుల్లోను, అటు అధికారుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి ముగింపునకు (ఈనెల 30)రావటం, మరోవైపు వారిని క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించటం తదితర పరిణామాల నేపథ్యంలో ఆర్థికశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నాలుగు రోజుల నుండి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శుల ఆధ్వర్యంలో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలు, శాఖలు, రంగాలవారీగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల లెక్కలను సమగ్రంగా సేకరించాలంటూ వివిధ శాఖాధిపతులను ఆదేశించారు. వీటితోపాటు సచివాయలంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది లెక్కలను కూడా తేల్చాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయి సమగ్ర వివరాలు రావాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాతే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీరితోపాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా ఓ మూడు నెలలపాటు కొనసాగించేందుకు వీలుగా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని సమాచారం. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కొనసాగించలేమంటూ ముఖ్యమంత్రి తేల్చిచెప్పినప్పటికీ ఇప్పటికిప్పుడే వారిని తొలగిస్తే పాలనపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. వివిధ శాఖలు, రంగాలతోపాటు సచివాయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అంటెండర్లలో సైతం ఎక్కువ మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌వారే ఉన్నారు. ఉన్నఫళంగా వీరందరినీ తొలగిస్తే ప్రభుత్వం నడవటమే కష్టంగా మారుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపు ఉత్తర్వులను ఇవ్వబోతున్నారని సమాచారం.
విభజన కాని సంస్థల పరిస్థితేంటి? 
                            ఇప్పటికే విభజన పూర్తయిన శాఖల్లోని ఉద్యోగుల సంఖ్యను తేల్చటం అధికారులకు చాలా సులభతరం. కానీ విభజన పూర్తికాని వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో (దాదాపు 100 ఉన్నాయి) ఉద్యోగుల సంఖ్యను ఎలా లెక్కగట్టాలా? అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సంస్థల నుండి పూర్తి డేటా 
వస్తేనే ఉద్యోగుల సంఖ్య సమగ్రంగా తేలుతుంది. ఇందుకోసం మరింత సమయం పట్టే అవకాశముంది. మరోవైపు ఇప్పటికే కొన్ని శాఖల నుండి వచ్చిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో సరైన డేటా ఇవ్వాలంటూ ఆర్థికశాఖ అధికారులు తిప్పి పంపిస్తున్నారు. ఈ కారణాలన్నింటిరీత్యా మొత్తం ప్రక్రియ (డేటా తెప్పించటం, క్రమబద్ధీకరించటం) చాలా ఆలస్యమవుతోందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆర్థికశాఖ అనుమతులకే లోబడిన వారికే...
                            గత పది పదిహేనేళ్ల నుండి రాష్ట్రంలో ప్రభుత్వ నియామకాలు లేకపోవటమే ప్రస్తుత దుస్థితికి కారణం. టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ కొలువుల క్రమబద్ధీకరణపై విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆశలపై సిఎం ఇప్పటికే నీళ్లు చల్లారు. ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించటం కూడా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖలు, రంగాలు, విభాగాల అధిపతులు తమ ఇష్టానుసారంగా చేపట్టిన నియామకాలను రెగ్యులరైజ్‌ చేయలేమని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఆర్థికశాఖ నియమ నిబంధనలకు లోబడి, పత్రికల్లో వెలువడిన ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ల ఆధారంగా రిక్రూట్‌ అయిన వారిని మాత్రమే క్రమబద్ధీకరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు కాంట్రాక్టర్ల పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్నప్పటికీ (పారిశుధ్య కార్మికులు తదితరులు) అలాంటి వారందరినీ క్రమబద్ధీకరించలేమని చెబుతున్నారు. 'ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన నేపథ్యంలో వారికి అభినందనల సమయంలో సచివాలయంలో పెద్ద మొత్తంలో చెత్త పోగుబడింది, దాన్ని ఎత్తేసేందుకు యుడిసి అనే కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాం, అంతమాత్రాన ఆ కూలీలందరి బాగోగులను ప్రభుత్వమే చూసుకోవాలంటే ఎలా?' అని ఈ సందర్భంగా ఒక అధికారి ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న ఈ లెక్కలన్నీపోగా అధికారికంగా 30 వేల నుండి 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే పర్మినెంట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేరు చెప్పటానికి నిరాకరించిన ఒక అధికారి వ్యాఖ్యానించారు.

No comments: