ఘనంగా రవీంద్రుడి జయంతి ఉత్సవాలు
కోల్‌కతా : విశ్వకవి రవీంద్రుడి ఉత్సవాలు శుక్రవారం నాడు భారత్‌లో ఘనంగా జరిగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ 153వ జయంతి ఉత్సవాల్ని పశ్చిమ బెంగాల్‌లో, దేశంలో ఇతర చోట్ల నివసిస్తున్న బెంగాలీలు ఘనంగా నిర్వహించారు. రవీంద్రుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ..'గొప్ప జాతీయవాది, ఆలోచనావాది అయిన గురుదేవ్ రవీంద్రుడ్ని ప్రతి భారతీయుడూ గుర్తుచేసుకుంటున్నాడు. నేనూ వారిలో ఒకరిగా రవీంద్రుడికి నివాళి అర్పిస్తున్నా. గొప్ప వ్యక్తిత్వం వున్న రవీంద్రుడు కాలానికి అతీతమైన భావనలు అందించారు. మనలో మానవత్వ స్ఫూర్తిని రగిలించారు' అని పేర్కొన్నారు. ఇతరుల సంస్కృతీ, సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే అస్తిత్వాన్ని తెలియజేసే గొప్ప సాహిత్యాన్ని రూపకల్పన చేసిన వ్యక్తిగా ఠాగూర్‌ను రాష్ట్రపతి కొనియాడారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ఆయన్ని క్రియెటివ్ జీనియస్‌గా ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రవీంద్రుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలోని ఠాకూర్ నివసించిన ఇంట్లో రవీంద్రుడి జయంతి సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
No comments:
Post a Comment