- ప్రభుత్వ నిర్ణయం -- ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్)ను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గురువారం రాత్రి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేదిన టెట్ జరగాల్సిఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎపిఎన్‌జిఓలు సమ్మెకు దిగడంతో పరీక్షను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. టెట్ పరీక్ష నిర్వహణ వరకు సహకరించాలని ఉద్యోగులను కోరాలని తొలుత భావించినా, ఎపిఎన్జీఓల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు. ఈ నెలాఖరులోగా టెట్‌ను నిర్వహిస్తామని వాయిదా నిర్ణయం తీసుకున్న తరువాత మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్దసారధి తెలిపారు.
No comments:
Post a Comment