MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, February 2, 2014

కనీపసవేత‌నం ఇవ్వాలని చీపుర్లతో నిరసన

- కలెక్టరేట్‌ ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా   - సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె: వక్తలు  - ప్రజాశక్తి నెల్లూరు
తమకు కనీస వేతనం 12,500 ఇవ్వాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌ ఎదుట శనివారం ఉదయం చీపుర్లు, పారలు పట్టుకుని ధర్నా చేశారు.
తొలుత స్థానిక సుందరయ్య విగ్రహం నుంచి వారు చీపుర్లు, ఇతర పనిముట్లు చేతపట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. గాంధీభొమ్మ, విఆర్‌సి సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ చేరుకున్నారు. అక్కడ ధర్నా చేశారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఈ ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు, సిఐటియు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ సొసైటీ కార్మికుల కనీస వేతనం 12,500 ఇస్తామనీ, వారందర్నీ పర్మినెంట్‌ చేస్తామనీ, పిఎఫ్‌ డబ్బులు రూ.6.50 కోట్లు వారి ఖాతాలో జమ చేయడంతోపాటు ఇతర సమస్యలూ పరిష్కరిస్తామని గతంలో జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇంత వరకూ ఒక సమస్యనూ పరిష్కరించలేదని అన్నారు. దానికి తోడు వారి పిఎఫ్‌ సొమ్మును కాంట్రాక్టర్లకు బిల్లులుగా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మూడేళ్ల నుంచి పోరాటాలు సాగిస్తున్నా కార్మికులను పర్మినెంట్‌ చేయకపోవడం దారుణమన్నారు. కార్మికుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులేనని తెలిపారు. నిత్యం మట్టి, మురుగు, మలమూత్రాల మధ్య పని చేసే కార్మికులకు కనీసం మాస్క్‌లు, గ్లౌజులు వంటి సీల్డ్‌ పరికరాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఆ కారణంగా వారు అనారోగ్యంపాలవుతున్నారని ఆందోళన వ్య్తం చేశారు. వెంటనే మాస్క్‌లు, గ్లౌజులు, చెప్పులు, సబ్బులు,నూనె, మధ్యంతర భత్యం, హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండు చేశారు. ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్ల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కోరారు. పై సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3 నుంచి ఐదో తేదీ వరకూ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే కార్మికులు సమ్మెకు సిద్ధమవుతారని తెలిపారు. అనంతరం జెసి బి.లక్ష్మీకాంతానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన కార్పొరేషన్‌ కమిషనర్‌తో మాట్లాడి కార్మికుల ఖాతాలో పిఎఫ్‌ సొమ్ము జమచేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ యూనియన్‌ జిల్లా, నగర కార్యదర్శులు కె.పెంచలనరసయ్య, అల్లాడి గోపాల్‌, నాయకులు అలీసమ్మ, చంద్రమ్మ, వెంకట్రావు, మాలకొండయ్య, సురేష్‌, బాలయ్య, లక్ష్మమ్మ, సత్యం, బక్కా ఏసు, దేశయ్య, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments: