MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, January 22, 2014

Andhrajyothy_Hyderabd P.No-5, Date 22-01-2014 కంప్యూటర్‌ విద్య కొనసాగించాలి

-  స్పందించకపోతే ఆందోళన తప్పదన్న ఎమ్మెల్సీలు
-  ఉద్రిక్తంగా మారిన చలో డైరెక్టరేట్‌ నాయకుల అరెస్ట్‌
ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా 6300 పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను కొనసాగించి, ప్రస్తుత టీచర్లనే కొనసాగించాలని ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. కంప్యూటర్‌ టీచర్స్‌ సంఘం(సిటిఎస్‌) మంగళవారం చేపట్టిన చలో డైరెక్టరేట్‌ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన చేస్తున్న టీచర్లను పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రమణ్యం, బి నాగేశ్వర్‌రావు, శ్రీనివాసులురెడ్డి మద్దతు ప్రకటించారు. ఉదయం పదిన్నరకే వందలాది మంది లక్డికాపూల్‌లోని పాఠశాల డైరెక్టరేట్‌కు చేరుకుని అధికారులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కంప్యూటర్‌ విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఐదేళ్ల గడువు పూర్తయిందనే కారణంతో రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది టీచర్లను తొలగించారని, దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 25లక్షల మంది కంప్యూటర్‌ విద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పది వేల కంప్యూటర్‌ టీచర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు వీరితో గొడ్డుచాకిరీ చేయించుకున్న ప్రభుత్వం... తొలగించే ముందు వారి పరిస్థితిని ఆలోచించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడి కంప్యూటర్‌ విద్యను, టీచర్లను కొసాగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కంప్యూటర్‌ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. మూడు నెలలుగా కంప్యూటర్‌ టీచర్లను కొనసాగించాలని అనేక ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అనంతరం జాయింట్‌ డైరెక్టర్‌ భార్గవకు వినతిపత్రం అందించారు. ఆయన స్పందిస్తూ.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీనిచ్చారు. అయితే, వినతిపత్రం ఇచ్చాక బయటికొచ్చి మళ్లీ కంప్యూటర్‌ టీచర్లు ఆందోళనకు దిగగా పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకు ప్రజాసంఘాల నాయకులు ఉమమహేశ్వరరావు, యాదయ్య మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ బ్రహ్మాజీ తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments: