- ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు
Posted on: Thu 05 Dec 01:05:01.802558 2013 ప్రజాశక్తి-గుంటూరు
ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు 2006యుజిసి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయంలో బుధవారం ఎయిడెడ్ డిగ్రీఅధ్యాపకుల సమావేశం జరిగింది. గురవయ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బోసుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడారు. ప్రస్తుతం పనిచేస్తున్న, విశ్రాంత డిగ్రీ అధ్యాపకులకు 2006 పెండింగ్ బకాయిలు ఇంకా చెల్లించకపోవడం దారుణమని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఎపి ఎయిడెడ్ డిగ్రీ అధ్యాపకుల తరపున ముస్లిం కళాశాల అధ్యాపకులు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జులై 2009వరకూ ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులకు, యూనివర్శిటీ, ప్రభుత్వ అధ్యాపకులకు మాత్రమే ప్రభుత్వం బకాయిలు చెల్లించిందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వివిధ కళాశాలల అధ్యా పకులు ఈసందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు వినతిపత్రం సమర్పించారు. త్వరలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, కమిషనర్ తదితరులకు వినతిపత్రాలు సమర్పించాలని, సమస్య పరిష్కారంకాకుంటే హైకోర్టును ఆశ్రయించాలని సమావేశంలో తీర్మానించారు.

No comments:
Post a Comment