Posted on: Wed 02 Oct 00:48:10.077819 2013
10 వ పిఆర్‌సికి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినతి
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టాని ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 10వ పిఆర్‌సికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో 10 వ పిఆర్‌సి చైర్మన్ పికె అగర్వాల్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా కన్వీనర్ ఎస్ శరత్‌బాబు మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కింద రాష్ట్రంలో 9 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. 2011లో కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సరవణ చేపట్టారని, కాని ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఒక్క సంవత్సరం ఆలస్యంగా చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం 10 వ పిఆర్‌సిలోపైనా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏళ్ళ తరబడి పని చేస్తున్న ఔట్‌సోరింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రైగ్యులరైజ్ చేసి, క్యాజువల్, ప్రసూతి సెలవులతో సహా అన్ని సెలవులను చట్ట ప్రకారం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment