MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, November 13, 2013

రోడ్డున పడ్డ కంప్యూటర్ బోధనా టీచర్లు

హైదరాబాద్: సర్కారు ప్రతిష్టాత్మంగా చేపట్టిన కంప్యూటర్ విద్య మిథ్యగా మారుతోంది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగులుతోంది. పేద విద్యార్థుల కోసం చేపట్టిన ఐసిటి పథకానికి తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించే టీచర్లను తొలగించేందుకు సర్కారు సిద్ధమైంది. ఐసిటి టీచర్ల స్థానంలో ఆయా స్కూల్ టీచర్లనే నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎడ్యుకేషన్ కమిషనర్‌, డైరెక్టర్‌ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు పంపించింది.
ప్రైవేటు పాఠశాలకు ధీటుగా
 
ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యను అందించేందుకు 2008 సెప్టెంబర్ 22న ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ ట్రైనింగ్ స్కీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18,736 పాఠశాలకు గానూ 6,300 స్కూళ్లను ఎంపిక చేసింది. దీంతో ఆయా స్కూళ్లలో కంప్యూటర్ విద్యను బోధించేందుకు 12,600 మందిని ప్రభుత్వం నియమించింది.
రోడ్డున పడ్డ కంప్యూటర్ బోధనా టీచర్లు
 
ప్రస్తుతం ఐసిటి ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇందులో పనిచేస్తున్న టీచర్లకు.. ఒక్కొక్కరికి 2,600 రూపాయలను మాత్రమే వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. జీవో నెంబర్ మూడు ప్రకారం కనీస వేతనంగా 10 వేల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా సర్కారు స్పందించలేదు. దీంతో కంప్యూటర్ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమ స్థానంలో ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు అతి తక్కువ వేతనాలైనా పనిచేస్తూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తింపు లభిస్తుందనే ఆశతో ఉన్నామని ఈ సందర్బంగా వారు తెలిపారు. అయితే..ప్రస్తుతం ప్రభుత్వం ఐసిటిల నిర్వహణపై చేతులెత్తేసింది.
కిరణ్ సర్కార్ నిర్ణయంతో సుమారు 12,600 మంది రోడ్డున పడ్డారు. జీతం తక్కువైనా పర్మినెంట్‌ అవుతుందన్న ఆశతో వెట్టిచాకిరి చేశామని ఐసీటీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కంప్యూటర్‌ టీచర్లను తొలగించాలనుకోవడం అన్యాయమని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

No comments: