32వ రోజుకు చేరుకున్న 108 సిబ్బంది సమ్మె
ప్రజాశక్తి - కలెక్టరేట్ Tue, 20 Aug 2013, IST
సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 108 సర్వీసుల ఉద్యోగుల సంఘం చేస్తున్న సమ్మె 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంగళవారం సిబ్బంది చేతులను తాళ్లతో బంధించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభాకర్, త్రినాధ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌లు సాధించేందుకు వీలు లేకుండా తమను తాళ్లతో బంధించి కక్ష సాధింపులకు పాల్పడుతుందని అన్నారు. అనుభవంలేని వారితో వాహనాలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో జివిఎంకె యాజమాన్యం ఆడుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో 108 సర్వీసుల ఉద్యోగుల సంఘం నాయకులు తిరుపతిరావు, శ్రీను, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment