MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, May 1, 2014

ACT NEWS:(:MAY DAY) Traditional May Day celebrations , మేడే దీక్ష, శ్రామిక నాయిక‌లు ....


    Mayday is an emergency procedure word used internationally as a distress signal in voice procedure radio communications. It may derive from the French expression "venez m'aider", meaning "come help me", the last two syllables of which sound similar to "Mayday". Alternatively, it may have been coined randomly, making the similarity to "m'aidez" coincidental.[1]
    It is used to signal a life-threatening emergency primarily by mariners and aviators, but in some countries local organisations such aspolice forces, firefighters, and transportation organizations also use the term. The call is always given three times in a row ("Mayday Mayday Mayday") to prevent mistaking it for some similar-sounding phrase under noisy conditions, and to distinguish an actual Mayday call from a message about a Mayday call.
  1. en.wikipedia.org/wiki/Mayday

    Mayday is an emergency procedure word used internationally as a distress signal in voice procedure radio communications. It may derive from the French ...
  2. www.iww.org/history/library/misc/origins_of_mayday

    Most people living in the United States know little about the International Workers' Day ofMay Day. For many others there is an assumption that it is a holiday ...
  3. https://www.marxists.org/subject/mayday/

    Let the winds lift your banners from far lands. With a message of strife and of hope: Raise the Maypole aloft with its garlands. That gathers your cause in its scope ...
  4. www.infoplease.com › ... › Calendar & Holidays › Major Holidays

    May 1st, often called May Day, just might have more holidays than any other day of the year. It's a celebration of Spring. It's a day of political protests.
  5. publicholidays.in/may-day/

    May Day is also known as Labour Day and is celebrated on 1 May each year. It is a national and bank holiday that corresponds to the International Workers' Day ...
  6. www.maydaymagazine.com/

    HOME · CURRENT ISSUE · PAST ISSUES · SUBMIT · CONTACT · ABOUT. © 2014 new american press. all rights reserved. hosting and design by: Experience ...
  7. 1 2 3 4 5 6 7 8 9 10 
  8. మేడే దీక్ష
    Posted on: Thu 01 May 02:44:30.358767 2014

                సమాజ గతినీ, పురోగతినీ నిర్దేశించడంలో నిర్ణయాత్మక పాత్ర వహించే కార్మికవర్గానికి అంతర్జాతీయ శ్రామిక దిన శుభాకాంక్షలు. క్రిస్మస్‌, రంజాన్‌ వంటి మత సంబంధిత పండుగలు కాకుండా జగత్తంతటా జనం జరిపే పెద్ద ఉత్సవం బహుశా ఇదే కావచ్చు. దాదాపు 130 ఏళ్ల క్రితం 1886లో అశువులు బాసిన కార్మిక నేతలను ఈనాటికీ గుర్తు చేసుకుంటున్నామంటేనే ఆ త్యాగాల ఘనత సుస్పష్టమవుతుంది. అందుకనే కార్మిక సంఘాలు మేడేను పండుగ కంటె ఒక దీక్షాదినంగా జరపాలంటాయి. ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడానికి భీకర పోరాటాన్ని సాగించిన కార్మిక లోకానికి యావత్‌ సమాజమూ జేజేలు పలుకుతుంది. పోరాడి త్యాగాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు క్రమంగా కనుమరుగైపోతోంది. కనీస వేతనం, కార్మిక చట్టాలు, హక్కులు, సౌకర్యాల కోసం కార్మికవర్గం ఇప్పటికీ సుదీర్ఘ పోరాటాలు చేయవలసి వస్తోంది. మన పొరుగునే ఉన్న యానాంలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న పాపానికే రెజెన్సీ కార్మికులపై పాలకులు కాల్పులు జరిపి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. హర్యానాలోని మనేసర్‌లోని మారుతి సుజికీ కార్మికులు ఏడాది దాటినా ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఎన్నో నిర్బంధాలను, సస్పెన్షన్లనూ తట్టుకుని కర్ణాటకలోని టొయోటా కిర్లోస్కర్‌ కార్మికులు సుదీర్ఘ సమ్మె చేస్తున్నారు. ముంబాయిలో రవాణా రంగంలో సమ్మెను నిషేధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పోరాట పటిమతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఇలాంటి సుదీర్ఘ సాహసోపేత పోరాటాల ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి.
               అభివృద్ధి, జిడిపి వృద్ధిరేటు పెరుగుదల గురించీ పాలకులు గొప్పగా చెబుతుంటారు గానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబర్‌ బ్యూరో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోందని కుండబద్దలు గొట్టింది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య గల యువతలో డిగ్రీ పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరు నిరుద్యోగి అని బ్యూరో సర్వే (2012-13) నిగ్గు తేల్చింది. పని చేసే వయస్సు వారే 64 శాతం మంది ఉన్న అతి యౌవ్వన దేశంగా భారత్‌ 2020 నాటికి రూపొందుతుందని ఓ అంచనా. మరి అలాంటి నవయువ భారత్‌ నిరుద్యోగ భారతంగా కునారిల్లాల్సిందేనా అన్నది ఈనాడు మన ముందున్న ప్రశ్న. నయా ఉదారవాద విధానాల మూలంగా సంపద పెరగవచ్చు గానీ అది ఉద్యోగాలను, పనిని సృష్టించడంలేదు. ఆ విధానాలతో సాధించినది ఉపాధి రహిత అభివృద్ధి మాత్రమే. పనిచేయగల యువతీయువకులందరికీ ఉపాధి కల్పించడాన్ని ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించాలి. అందుకు విశాల పోరాటాలు సాగాలి. అది కేవలం నిరుద్యోగులకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు, యావత్‌ సమాజానిది కూడా. ప్రపంచవ్యాప్తంగానే ఉద్యోగులను కుదిస్తున్నారను. కార్మికులకిచ్చే వేతనాల్లో, ఉద్యోగుల పెన్షన్‌, సామాన్యులకు విద్య, వైద్యం వంటి సౌకర్యాల్లో కోతలు విధిస్తున్నారు. సంఘటిత కార్మిక రంగం కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతోంది. ప్రపంచ ట్రేడ్‌ యూనియన్ల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు) రానున్న అక్టోబర్‌ మూడవ తేదీన ప్రపంచ కార్యాచరణ దినాన్ని నిరుద్యోగానికి వ్యతి రేకంగా పాటించాలని నిర్ణయించింది. విశ్వవ్యాప్తంగా సమ్మెలు, మిలిటెంట్‌ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. నిరుద్యోగ సమస్య కార్మిక వర్గానికి పెద్ద సవాల్‌గా నిలుస్తోంది కనుకనే దానికి వ్యతిరేకంగా భారీ పోరాటాలకు సన్నద్ధమవుతోంది.
               ఏ దేశంలోనైనా సమాజ మార్పునకు చోదకశక్తి కార్మికవర్గమే. మనలాంటి వెనుకబడిన దేశాల్లో కార్మికలోకం మరింత బాధ్యతగా ఇతర వర్గాలు, తరగతుల ప్రజలను సమీకరించి వారి ఉద్యమాలకు బాసటగా నిలవాలి. గ్రామీణ భారతం రైతు ఆత్మహత్యలు, కూలీల వలసలు, ఇతర సమస్యలతో సంక్షుభితంగా ఉంది. పంటలకు మద్దతు ధరల కోసం, సాగు నీటి సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు, తదితర సమస్యలపై పెద్దపెద్ద ఆందోళనలు సాగిస్తున్న రైతులు, కూలీలతో కార్మికవర్గం భుజంభుజం కలిపి పోరాడాలి. దళితులు, ఆదివాసుల బాధలు వర్ణనాతీతం. ఆరు దశాబ్దాల స్వాతంత్య్రానంతరమూ కులవివక్ష రక్కసి కోరలు మరింతగా చాచడం దేశ దౌర్భాగ్యం. కొండకోనల్లోని ఆదివాసుల అవస్థలు ఇన్నిన్నిగావు. మైనార్టీల దుస్థితిని గురించి సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే నియమించిన సచార్‌ కమిటీ వెల్లడించింది. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల పరిస్థితీ కడు దయనీయం. పని ప్రదేశాల్లో వారిపై లైంగిక వేధింపులు పెరగడమేగాక తిరిగి ఇంటికో, హాస్టల్‌కో క్షేమంగా చేరలేని దురవస్థ. అణగారిన తరగతులు, వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసమూ కార్మికవర్గం నడుం బిగించాలి.
                ఇది సార్వత్రిక ఎన్నికల తరుణం. మేడేకు ఒక్క రోజు ముందు తెలంగాణలో పోలింగ్‌ జరగ్గా వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్నాయి. ఐదేళ్లపాటు దేశాన్ని, ఈ రెండు రాష్ట్రాలను పాలించేవారిని ఎన్నుకునే ఈ సందర్భంలో నయా ఉదారవాద విధానాల సమర్థకులను ఓడించడం అందరి కర్తవ్యంగా తీసుకోవాలి. మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికగా ప్రజల మధ్య ఐక్యతను ఇచ్ఛిన్నం చేసే శక్తులను ఓడించాలి. కార్మికులు, ఉద్యోగులకే గాక రైతు, వ్యవసాయ కార్మికులకు, బడుగు, బలహీన వర్గాలకూ నష్టదాయకమైన విధానాలను తిప్పిగొట్టాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల ననుసరించేవారిని గెలిపించాలి. సామాన్యులకు అనుకూలమైన విధానాలకై నిలిచే వామపక్ష పార్టీలను బలోపేతం చేయాలి. తద్వారా చట్టసభల్లో ప్రజాపోరాటాలకు బలం చేకూరుతుంది. అందుకనే వామపక్షాల విజయానికి శ్రామిక లోకం దీక్షబూనాలి. ఇదే మే దినోత్సవ ప్రత్యేక సంకల్పం కావాలి.
  9. శ్రామిక నాయిక‌లు ....
    Posted on: Thu 01 May 00:06:17.438858 2014


               శ్రమైక జీవన సౌందర్యం లేనిదే ఈ సమాజం లేదు. అలాంటి ప్రపంచ శ్రమజీవుల పోరాటస్ఫూర్తికి సంకేతం మే దినోత్సవం. నాడు కార్మికులు తిండి కోసం, సుదీర్ఘమైన పనిగంటల్ని తగ్గించాలని పోరాటం ప్రారంభించారు. కానీ నేటికీ శ్రామికుల పరిస్థితి అందుకు భిన్నంగా లేదనే చెప్పుకోవాలి. నేటి ఆధునిక సమాజంలో అసలు మార్పు జరగలేదా అంటే జరిగింది. అప్పటికీ ఇప్పటికీ ఉద్యోగాల్లో, పని పద్ధతుల్లో, సాంకేతికంగా, మార్పు వచ్చింది. అదే సందర్భంలో శ్రామికుల సమస్యల్లో కూడా మార్పు వచ్చింది.ఈ మార్పులకు అనుగుణంగా పోరాటాల్లో కూడా మార్పులు రావాలంటున్నారు శ్రామికమహిళా నేతలు. అందరం కలిసి సమస్యలపై సంఘటితంగా పోరాడితేనే విజయం సాధించగలమని వారంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. 
    ఒకప్పుడు ఇంటిచాకిరీలోనే మగ్గిపోయిన మహిళ నేడు నిర్ణాయక శక్తిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఎటువంటి హక్కులూ లేకుండా ద్వితీయ పౌరురాలిగానే ఉండిపోయిన అతివలు ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. 'ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే, ముద్దార నేర్పింపగన్‌' అన్న కవి మాటలు నిజమైనట్లు మహిళలు ప్రవేశించని రంగం లేదనే చెప్పుకోవచ్చు. ఇంటాబయటా తన బాధ్యత లను సవ్యసాచిలా నిర్వర్తిస్తూ ఆధునిక మహిళ మున్ముందుకు సాగి పోతోంది. త్రివిధ దళాలలో సైతం మహిళ తన ప్రతిభను కనబరుస్తోంది. అంతేకాదు శాస్త్ర, సాంకేతిక రంగాలలో అంతర్జా తీయ ఖ్యాతిని సంపాదిస్తోంది. వందేళ్ల నాడు పనిగంటల కుదింపు, వేతనాల పెంపు, వెట్టిచాకిరీ విముక్తి కోసం పురుషులతో కలిసి పోరా డింది. నేడూ పోరాటాల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపే. మరోవైపు హింసను, శ్రమదోపిడీని, ఉద్యోగ అభద్రతను, లైంగిక వేధింపులను ఎదుర్కొంటూ, మంచినీరు, క్రెచ్‌, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నారు. 
    ''శ్రామిక మహిళలకు కనీస వేతనాలు, ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, పెన్షన్‌ వంటి చట్టపరమైన హక్కులు అమలు చేయాలి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీవో 3 ప్రకారం కనీస వేతనాలివ్వాలి. పెరుగుతున్న ధరలను అరికట్టాలి. అదే సందర్భంలో శ్రామిక రంగంలో మహిళల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్‌, మత్స్య, ఇంటిపనివారు, తదితర అన్నిరంగాల సమస్యలపై అధ్యయనం చేసి, పోరాటాలకు నాయకత్వం వహించే స్థాయికి మహిళలు ఎదగాలి'' అని సిఐటియు రాష్ట్ర నాయకులు ఎస్‌.పుణ్యవతి అన్నారు.
    'ఆకలి కడుపులతో చస్తూ బతికేకన్నా చావడం మేలు..' అన్న నినాదంతో మహిళాలోకాన్ని కదిలించి ఏకతాటిపై నిలిపిన ఘటన 1857, మార్చి 8న న్యూయార్క్‌ నగరంలో జరిగింది. ఆ తర్వాత అనేక దేశాలలో జరిగిన పారిశ్రామిక పోరాటాలలో పురుషులతో పాటు స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    ''నాటి పోరాట స్ఫూర్తిని నేటి మహిళలూ అందిపుచ్చుకోవాలి. ఆ చైతన్యాన్ని రగిలించాల్సిన పరిస్థితి నేడెంతైనా ఉంది. నేడు సమస్యలు నేరుగా కనిపించడంలేదు. వాటిని అర్థంచేసు కోవడమే కష్టమైపోతోంది. అలాగే సంఘటితం కాకుండా కార్మికుల్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టేస్తున్నారు నేటి పాలకులు. అందుకే అసలు కారణాల్ని తెలుసుకుని, ఐక్యంగా పోరాడితేనే విజయం సాధించడం తేలికవుతుంది'' అని సిఐటియు కేంద్ర నాయకులు పి.రోజా అన్నారు.
    గత రెండు శతాబ్దాలుగా పాలకపక్షాలు అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థికవిధానాల వల్ల కార్మికులు పోరాడి సాధించు కున్న హక్కులు కూడా హరించుకుపోతున్నాయి. పర్మినెంట్‌ ఉద్యోగాల స్థానే క్యాజువల్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 45 శాతం మాత్రమే. లక్షలాదిగా ఉన్న కాంట్రాక్టు కార్మికులకు నిజవేతనాలు లేవు. ఉద్యోగభద్రత అంతకన్నా లేదు. పనిభారం పెరిగింది. 
    ''ప్రభుత్వ పథకాలలో పనిచేసే అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, బీడీ రంగాల్లో పనిచేసే శ్రామిక మహిళలు, ఐటిడిఎ వర్కర్లు శ్రమదోపిడీకి గురవుతున్నారు. గతంలో ఫ్యాక్టరీ కేంద్రంగా వస్తూత్పత్తి సాగేది. ఇప్పుడు ఇంటికే ముడిసరుకులు తెచ్చుకుని పనిచేసే గృహ కార్మికులుగా మారిపోయారు. వీరంతా రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. కాంట్రాక్టర్లు, దళారుల దోపిడీకి వీరు గురవుతున్నారు'' అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమ అన్నారు.
    దేశ ఆర్థిక వ్యవస్థకు అసంఘటితరంగ కార్మికులు అందిస్తున్న వాటా ఎంతో ఉంది. ఈ రంగంలో అత్యధికులు మహిళలే. మొత్తం శ్రామికులలో 85 శాతం అసంఘటితరంగంలో ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో 77 శాతం మంది సగటున రోజుకు 20 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం నియమించిన అర్జున్‌సేన్‌ గుప్తా కమిటీయే తేల్చి చెప్పింది. ఈ కమిటీ నివేదికలో పేర్కొన్న కనీస వేతనం, సామాజిక భద్రతా పథకాలు అమలుకావడం లేదు. 
    ''మన దేశంలో 45.6 కోట్ల మంది శ్రామికుల్లో 39.8 కోట్ల మంది అసంఘటితరంగంలో ఉన్నారు. ఐకెపి, ఆశ, 104, 108 సర్వీసులలో పనిచేస్తున్న శ్రామికమహిళలు శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చే పారితోషికాలైనా సక్రమంగా ఇవ్వాలి. ఈ సేవా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పర్మినెంటు ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరు వేతనాల్లో వివక్షకు గురవుతున్నారు. ప్రైవేటీకరణ పుణ్యమా అని సాధించుకున్న చట్టాలు కూడా అమలుకాకుండా పోతున్నాయి'' అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి చెప్పారు. 
    బ్యాంకింగ్‌, ఇన్స్యూరెన్స్‌ రంగాల్లో 1990-93 మధ్యలో మహిళల నియామకాలు ఎక్కువగా జరిగాయి. కానీ నేడు తగ్గిపోయాయి. బీమా రంగంలో ఎల్‌ఐసి అతి పెద్ద సంస్థ. అయితే నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో దీన్ని కూడా ప్రైవేటుకు ధారాదత్తం చేయాలని ప్రభుత్వం యత్నించింది. అయితే కార్మికులు ఐక్యంగా నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి బీమా రంగ ప్రైవేటీకరణ ఆగింది. 
    ''నూతన ఆర్థిక విధానాలను మేం మొదటి నుండీ వ్యతిరేకి స్తున్నాం. చాలామందికి వాటిపట్ల భ్రమలున్న సమయం లోనే మేమే వ్యతిరేకించాం. దాదాపు 90ల నుండీ మేం ఈ విధానాలను ఎండగడుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్నాం'' అని ఎల్‌ఐసి జోనల్‌ వర్కింగ్‌ ఉమెన్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ ఎన్‌.అరుణకుమారి చెప్పారు. 
    పియర్‌లెస్‌ వంటి రంగాలైతే ఇప్పటికీ అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతు న్నాయి. ఇది ప్రైవేటు సంస్థే. అయితే ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు అభద్రతా భావంతో గడపాల్సి వస్తోంది. అందువల్ల వీరికి తమ సంస్థను కాపాడు కోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంది.
    ''మా సంస్థను కాపాడుకోవడమే మా ప్రధాన కర్తవ్యం. గతంలో కూడా ఇలాగే పోరాడి సంస్థను నిలబెట్టుకున్నాం'' అని ఆల్‌ ఇండియా పియర్‌లెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సహాయకార్యదర్శి కె. నాగలక్ష్మి అన్నారు.
    ఐటి రంగంలోని ఉద్యోగులూ సమస్య ల్ని ఎదుర్కొంటున్నారు. ''మాకు పని వేళలు, పనిగంటలు సక్రమంగా లేవు. యూనియన్‌ పెట్టుకునే హక్కూ లేదు. ఉద్యోగుల్ని అనారోగ్యకర పోటీలతో విడగొ డుతున్నారు'' అని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న ప్రసన్నలక్ష్మి చెప్పారు.
    వ్యవసాయంలో ప్రధాన భూమిక నిర్వహించే వ్యవసాయ కార్మికులు నేడు కనీసవేతనాల్ని పొందలేక పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణప్రాంతాల్లో పనికి ఇబ్బందిలేద నేది ఒకవైపు వినిపిస్తున్న వాదన. కానీ మరోవైపు చేసిన పనులకు సరైన వేతనాలు చెల్లించడంలేదనీ, పనుల కోసం సుదూర ప్రాంతాలకు వలసపోయి దగాపడ్తున్నారన్నది మరో వాదన.
    ''ఉపాధి హామీ పథకంలో మేము చేసిన పనికి రావాల్సిన డబ్బుల్లో నాలుగో వంతే మాకు దక్కుతోంది. దానితో మా కుటుంబాలు ఎలా గడవాలి? మేము ఈ పనుల కోసం వలస వచ్చి, పెరిగిన ధరలతో, నిలువ నీడలేక అల్లాడుతున్నాం'' అని ఈ పథకం కింద పనిచేసి, దగాపడిన లక్ష్మమ్మ చెప్పారు. 
    నేడు మీడియా కూడా సమాజంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో మహిళల శాతమూ పెరిగింది. ఉద్యోగ అభద్రత ప్రధానంగా ఈ రంగంలో ఎదుర్కొంటున్న సమస్య.
    ''ఉద్యోగ అభద్రత ఈ రంగంలో ప్రధానంగా ఉంది. ఇక లైంగిక వేధింపులకు గురించి చెప్పనవసరం లేదు. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి లైంగిక వేధింపుల నిరోధక కమిటీల్ని అన్ని మీడియా సంస్థలు ఏర్పాటు చేయాలి'' అని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.మంజరి అన్నారు.

No comments: