MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, April 24, 2014

ఉద్యోగుల సంక్షేమం - సార్వత్రిక ఎన్నికలు --- "కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌ అగమ్యగోచరంగా మారింది".


Posted on: Thu 24 Apr 00:37:09.119886 2014
ఈ ఎన్నికల తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కావాల్సిన కొన్ని ముఖ్యమైన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. 10వ పిఆర్‌సి నివేదిక మే 7 తర్వాత గవర్నర్‌కు అందించే అవకాశం ఉంది. అది జూన్‌ 2న ఏర్పడే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవచ్చు. రెండు రాష్ట్రాల్లో సమానంగా అమలవుతుందా, తేడాలు వస్తాయా అనేది కొత్త సమస్యగా ముందుకొస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన 8.56 శాతం డిఎ ఎప్పుడు వస్తుందో తెలియటంలేదు. ఐదేళ్ల చర్చల ఫలితంగా అంకురించిన హెల్త్‌కార్డుల పథకం అర్థాంతరంగా ఆగిపోయింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పండిట్‌, పిఇటి పోస్టుల అప్‌గ్రేడేషన్‌, స్పెషల్‌ టీచర్‌ సర్వీస్‌కు నోషనల్‌ ఇంక్రిమెంట్లకు ఉత్తర్వులు ఎవరు ఇస్తారో తెలియదు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌ అగమ్యగోచరంగా మారింది. act news
                       దేశ, రాష్ట్ర చరిత్రలో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాంగ్రెస్‌ పార్టీ స్వతంత్ర పాలన అంతరించిన 1989 నుంచి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌, యుపిఎ-1, యుపిఎ-2 ప్రభుత్వాలు పనిచేశాయి. ఈసారి కేంద్రంతోపాటు తెలుగు వారి రెండు రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్‌, బిజెపిలు కూడా కేంద్రంలో స్వయంగా అధికారంలోకి రాగలమని చెప్పుకోలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పరిస్థితి గందరగోళంగానే ఉంది. అందువల్ల ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలే అనివార్యం కావచ్చు. అయితే ఈసారి ఏర్పడే ప్రభుత్వాల్లో ఉండే భాగస్వామ్య పార్టీల విధానాలు, వైఖరులను బట్టి పరిపాలనా తీరుతెన్నులతోపాటు ఉద్యోగుల సంక్షేమం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
                 ఉద్యోగుల సంక్షేమం అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంక్షేమంగా పరిగణించాలి. 1991 నుంచి గడిచిన 23 సంవత్సరాల కాలంలో 15 సార్లు సార్వత్రిక సమ్మెలు జరిగాయి. నూతన ఆర్థిక విధానాలు వద్దు, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి, 2004 తర్వాత నియామకమైన వారికి ప్రభుత్వ పెన్షన్‌ పథకాన్ని కొనసాగించాలి, భవిష్యనిధిపై 12 శాతం వడ్డీ కావాలి, సమ్మె హక్కును చట్టబద్ధం చేయాలి, తదితర డిమాండ్లతో ఆ సమ్మెలు జరిగాయి. అయినా బిజెపి, కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాలు ఆ పోరాటాలను పట్టించుకోలేదు. లక్షలాది పోస్టులు ఖాళీగానే పడావు పడివున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఖాళీ అయ్యే పోస్టులు రద్దవుతున్నాయి. దేశవ్యాప్తంగా 54 లక్షలమంది ఉద్యోగులు బలవంతంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంలోకి నెట్టబడ్డారు. వారిలో 1.26 లక్షమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. వామపక్షాల అభ్యంతరాలతో పదేళ్లుగా పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లును కాంగ్రెస్‌, బిజెపిలు కలిసి 2013లో ఆమోదించాయి. దానితో ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రతగా కొనసాగిన పెన్షన్‌, గ్రాట్యుటీ పథకాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం దాపురించింది.
                 ఉద్యోగుల కుటుంబాల అవసరాల కోసం పొదుపు చేసుకునే భవిష్యనిధి (జిపిఎఫ్‌)పై వడ్డీ 2000 దాకా 12 శాతం చొప్పున వచ్చేది. అది వాజ్‌పేయి ఎన్డీయే పరిపాలనలో 9 శాతానికి, సోనియాగాంధీ దర్శకత్వంలోని యుపిఎ పాలనలో 8 శాతానికి దిగజారింది. ఎయిడెడ్‌ విద్యాలయాల సిబ్బందికి అసలు భవిష్యనిధి పథకాన్నే ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6వ కేంద్ర వేతన సంఘం ద్వారా 2006 నుంచి జీతాలు గణనీయంగా పెరిగాయి. ఆనాడు పార్లమెంటులో వామపక్షాల బలం వల్ల అది సాధ్యమైంది. అయినా సిపిసి సిఫార్సులను నీరుగార్చేందుకు యుపిఎ-2 ప్రభుత్వం ప్రయత్నించింది. డిఎ వంద శాతం పెరిగితే వేతనంలో కలపాలనే సిఫార్స్‌ను అమలు చేయటం లేదు. సమ్మె హక్కును చట్టబద్ధం చేయాలనే డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే పెడచెవిన పెడుతున్నాయి. న్యాయమైన సమస్యల పరిష్కారానికై సమ్మె చేయబోతే అదే పెద్ద సమస్యగా ఎదురవుతోంది. ఇలాంటి ముఖ్యమైన సమస్యలు కాంగ్రెస్‌, బిజెపిలతో పరిష్కారం కావనే విషయం వాటి పరిపాలనా అనుభవాలతో పాటు 16వ లోక్‌సభ ఎన్నికల కోసం ఆ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు చూచినా తేలిపోతుంది. మీదు మిక్కిలి బిజెపి మేనిఫెస్టోలో పేర్కొన్న కార్మిక చట్టాలను సవరించాలనే ప్రతిపాదనతో ఉద్యోగుల హక్కులు మరింత హరించుకుపోయే ప్రమాదమూ పొంచి ఉంది. సిపిఎం మేనిఫెస్టోలో మాత్రమే పిఎఫ్‌ఆర్‌డిఎను రద్దు చేయటంతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామనే హామీలు ఉన్నాయి. ఆ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసిన అనుభవమూ ఉంది.
                 ఇక మన రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఖరులు మనకు తెలిసినవే. పోరాటాల ద్వారా జీతాలు ఎంతో కొంత పెంచుకోవటం తప్ప ప్రభుత్వాలు తమకు తాము పెంచింది ఏనాడూ లేదు. పైగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసిన అనుభవాలూ ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ పాలన ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడింది. పెన్షనర్లను మరింత వేధించింది. 2001 జులై నుంచి 2003 జులై దాకా అయిదు విడతల డిఎను ఎగ్గొట్టింది. డిఎ పోరాట కమిటీ, పెన్షనర్ల సంక్షేమ సంఘం చేసిన పోరాటాలు, వామపక్షాల ఒత్తిడితో దిగివచ్చి రెండేళ్ల తర్వాత అయినా చెల్లించక తప్పలేదు. ఉపాధ్యాయుల నియామకాల్లో అసంబద్ధమైన అప్రెంటిస్‌ విధానాన్ని కోట్ల విజయభాస్కరరెడ్డి (2003) హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టగా టిడిపి ప్రభుత్వం దాన్ని అలాగే కొనసాగించింది. పైగా రెండు సంవత్సరాల అప్రెంటిస్‌ సర్వీస్‌ను నాలుగు సంవత్సరాలకు పెంచి ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో వెనకడుగువేసింది. ఎయిడెడ్‌ సిబ్బంది పొట్టలు కొట్టిన పాపంలో టిడిపి, కాంగ్రెస్‌ రెండూ ఒకటే. యాక్ట్‌ 9/2000 తెచ్చిన టిడిపి ప్రభుత్వం అన్‌ఎయిడెడ్‌ సర్వీస్‌ను రద్దుచేసింది. ఆనాడు సిపిఎం చొరవతో అసెంబ్లీలో ప్రతిపక్షమంతా ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టింది. దానికి తోడు ఎయిడెడ్‌ యాక్షన్‌ కమిటీ చేసిన పోరాటంతో వెనక్కి తగ్గింది. తిరిగి అదే ద్రోహాన్ని యాక్ట్‌ 37/2005 ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసింది. జిఓ 330 ద్వారా పండితులకు లభించిన అప్‌గ్రేడేషన్‌ ప్రయోజనాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం యాక్ట్‌ 1/2005 ద్వారా దెబ్బతీసింది. వేతనాల్లో, పెన్షన్‌లలో భారీ కోతలకు పాల్పడింది.
                 ఈ ఎన్నికల తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కావాల్సిన కొన్ని ముఖ్యమైన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. 10వ పిఆర్‌సి నివేదిక మే 7 తర్వాత గవర్నర్‌కు అందించే అవకాశం ఉంది. అది జూన్‌ 2న ఏర్పడే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవచ్చు. రెండు రాష్ట్రాల్లో సమానంగా అమలవుతుందా, తేడాలు వస్తాయా అనేది కొత్త సమస్యగా ముందుకొస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన 8.56 శాతం డిఎ ఎప్పుడు వస్తుందో తెలియటంలేదు. ఐదేళ్ల చర్చల ఫలితంగా అంకురించిన హెల్త్‌కార్డుల పథకం అర్థాంతరంగా ఆగిపోయింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పండిట్‌, పిఇటి పోస్టుల అప్‌గ్రేడేషన్‌, స్పెషల్‌ టీచర్‌ సర్వీస్‌కు నోషనల్‌ ఇంక్రిమెంట్లకు ఉత్తర్వులు ఎవరు ఇస్తారో తెలియదు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌ అగమ్య గోచ రంగా మా రింది. వీటి తోపాటు ఉద్యోగ నియా మకాల్లో ఓపెన్‌ కేటగి రీలో ఎంపికై స్థానికేతర రాష్ట్రంలో పని చేస్తున్న వారిని ఆప్షన్‌ మేరకు స్వంత రాష్ట్రానికి పం పాల్సిన అవ సరం ఉంది. ఇలా ంటి సమ స్యలను క్రొత్తగా ఏర్పడే ప్రభు త్వాలే పరి ష్కారం చే యాల్సి ఉంటుంది. ఇం దుకు బాధ్య తాయుతంగా పని చేసే ప్రభుత్వాలు వస్తేనే సాధ్య మవు తుంది. ప్రభుత్వం ఏదైనా ప్రజల సంక్షే మంతోపాటు ఉద్యో గుల సమస్యలపై మాట్లాడే, పోట్లాడే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికైతే భరోసా ఉంటుంది. అందువల్ల దేశంలో ఉదారవాద ఆర్థిక విధానాలు అమలుచేసే పార్టీలు ఓడిపోవాలి. ప్రత్యామ్నాయ విధానాలు అమలుచేసే వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు గెలవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి పనిచేసే ప్రభుత్వాలు రావాలి. అందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు తమవంతు పాత్ర పోషించాలి. పోస్టల్‌ బ్యాలెట్‌తో సహా తమ కుటుంబాలు, బంధుమిత్రులు, ఇరుగుపొరుగువారి ఓట్లను ప్రభావితం చేయటానికి కృషి చేయాలి.

No comments: